Breaking News

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక

-ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు
-విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం నాడు సన్మానించుకోవడం చాలా ముదావహమని ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు. ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని, తల్లి దండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా గడిపేది టీచర్లతోనే అని, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది వారేనని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *