విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని అందుకే ప్రజల్లోకి వెళుతున్న వైస్సార్సీపీ నాయకులకు చిరునవ్వు లతో ఘన స్వాగతం పలుకుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ 66వ సచివాలయం గ్రీన్ ల్యాండ్ కళ్యాణ మండపం నుండి అబీజే కాలనీ ప్రాంతంలో ఇంటిఇంటికి పర్యటించిన అవినాష్ వారికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా వలంటర్, సచివాలయ వ్యవస్థ లను ప్రవేశపెట్టిన జగన్ కార్యాలయల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హతే ప్రామాణికంగా గడప వద్దకే సంక్షేమ లబ్ది అందజేస్తున్నారు అని,అవినీతిని ప్రాలద్రోలుతూ పారదర్శక పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఇదే గత తెలుగుదేశం ప్రభుత్వం లో అయితే అర్హత ఉన్న సరే ముసలి వాళ్ళు కూడా కార్యాలయల చుట్టూ తిరిగి విసిగివేసారి జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే గాని పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది కాదని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మేము చేపడుతున్నామని అసూయతో తమ చేతకానితనం ను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలకు ప్రజలకు సంబంధం లేని విషయాలతో రాద్దాంతం చేస్తున్నారని, వారికిబ విషయం తెలుసుకాబట్టే ఘటన జరిగినప్పుడు ఎవరు బయటకు రాలేదు అని,నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన మెప్పు కోసం పోలీసు స్టేషన్ దగ్గర హడావుడి చేసారని విమర్శించారు. తన నటనా చాతుర్యంతో షో రాజకీయాలు చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచారని కానీ ప్రజలకు ఇప్పటికే ఆయన డ్రామాలు అర్థమయ్యాయి అని రాబోయే రోజుల్లో వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నే ఈ డివిజన్ లో అభివృద్ధి జరిగిందని, ముస్లింలకి తగు ప్రాధాన్యత ఇస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్,వైస్సార్సీపీ నాయకులు నహీద్, షేక్ సుభాని,జగ్జీవన్ రావ్, చింతగుంట విజయ్, పోతురాజు, బోసు ,నాగ లత ప్రభుదాస్,సలీం,పిల్లి వెంకట్, రత్నకుమారి,అనిత, రమ, భత్తులు నాగేశ్వరరావు, డేవిడ్ అబ్బాస్.బినియమిన్, రబ్బాని బాబు బాయ్ ,అస్గర్ ఏసుబాబు, ప్రతాప్, మౌలాలి ,రామ్,క్రాంతి,జావిద్ పటాన్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …