విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
వినాయక చవితి పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ద్వారకా నగర్,భారతి నగర్ మరియు రావి చెట్టు సెంటర్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,అభిమానులు ఏర్పాటూ చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకొన్న నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను ప్రారంభించి అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం లను ప్రతిబించేలా జరిపే ఈ పండుగలు మనలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.అందరూ కలిసికట్టుగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్, 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి, తూర్పు కార్పొరేషన్ డైరక్టర్ ఇజ్జాడ తేజ వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి,సుబ్బారెడ్డి,అబ్బినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …