విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ప్రజా సమస్యల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 33వ డివిజన్ శివరావు వీధి, 24వ డివిజన్ వేముల శ్యామలాదేవీ వీధులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో ఆయా ప్రదేశాలను ఎమ్మెల్యే సందర్శించారు. 4 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా.. ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులను ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. వేముల శ్యామలాదేవీ వీధిలో యూజీడీ మరమ్మతులకు రూ. 15 లక్షలు., 33వ డివిజన్లో సన్నిధానం వీధి, జీఎస్ రాజు రోడ్డులను అనుసంధానం చేస్తూ యూజీడీ పునరుద్ధరణకు రూ. 9 లక్షల నిధులు మంజూరైనట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని.. ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట సీఈ ఎం.ప్రభాకర్, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు కుక్కల రమేష్, కమ్మిలి రత్న తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం
-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …