గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ కుటుంబంపై రాజకీయ విమర్శలు చేస్తే ఖబర్దార్ అంటూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు లిక్కర్ మాఫియాలో వైఎస్ భారతి రెడ్డి ఉన్నట్లు పలు ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. శుక్రవారం గుంటూరులోని వల్లూరి వారి తోట ఆయన కార్యాలయం వద్ద వైయస్ భారతి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం నారా లోకేష్ ప్లే కార్డులను చెప్పులతో కొట్టి మహిళలు నిరసన తెలిపారు. అదేవిధంగా వైఎస్ భారతి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు కి చెందిన టిడిపి నేత పై నిప్పులు చెరిగారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలకు పాలు పడితే సహించేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లో ఎన్టీ రామారావు శతవిధాల ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ మద్యపాన నిషేధానికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు మద్యం కంపెనీలకు పర్మిషన్లు ఇప్పించిన మాట నిజం కాదా అని నిలదీశారు. గుంటూరులోని తన కార్యాలయానికి కూతవేటు దూరములో ఉన్న టిడిపి కార్యాలయానికి ఎంతో దూరం లేదంటూ నన్ను రమ్మంటావా లేదా మీరైనా వస్తారా… అంటూ దేనికైనా సయ్యని సవాల్ విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ని ఆఫ్ టికెట్ అని అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు, ఇప్పటికైనా టీడీపీ నేత ఆనం వెంకట రమణ రెడ్డి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి అభిమానాలు మిమ్మల్ని బజారులో తిరగకుండా చేస్తారని హెచ్చరించారు.
అనంతరం Y.S. జగన్మోహన్ రెడ్డి, Y.S. భారతీ రెడ్డి దంపతుల చిత్రపటానికి రిపబ్లికన్ పార్టీ కార్యాలయం లో బోరుగడ్డ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, వందలాది మంది మహిళలు పాల్గొని, పాలాభిషకం నిర్వహించారు.