-అధికారులకు ఆదేశాలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, బుధవారం 24 వ డివిజన్ లో రూ.100.07 కోట్ల నిధులతో చేపట్టుచున్న పనులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. సర్కిల్-3 పరిధిలో గల నాగార్జుననగర్ ప్రాంతములో వేసిన నీటిసరఫరా డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లను పరిశిలించినారు. తదుపరి సర్కిల్-2 పరిధిలో గల మధురానగర్ నందు వేసిన నిటి సరఫరా పైపులైన్లను పరిశిలించి, మధురానగర్ డి.ఎం.ఎ వాల్వ్ చాంబర్లను పరిశిలించినారు. ఈ పర్యటనలో కమిషనర్ పైపులైన్ల కొరకు తవ్విన గోతులను పరిశిలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని మరియు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
3 వ డివిజన్ పరిధిలోని కరెన్సీ నగర్ ప్రాంతములోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికుల మస్తరు విధానము పరిశీలించారు. ప్రతి రోజు చెత్త సేకరణకు మరియు డ్రెయిన్స్ శుభ్రపరచుటకు సిబ్బంది వస్తున్నది లేనిది అడిగితెలుసుకొని ఎవరు చెత్తను వీధులలో లేదా డ్రెయిన్ లలో పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చు పారిశుధ్య సిబ్బందికి అందించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యటనలో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.