-అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్ఛ అమృత్ మహోత్సవం లో భాగంగా సర్కిల్-1 పరిధిలోని 55వ డివిజన్, చిట్టినగర్ కె.ఎల్.రావు నగర్ నందు ఎర్రకట్ట డౌన్ వి.ఎం.సీ. పార్క్ వద్ద అదనపు కమిషనర్ (జనరల్) శ్యామల, జోనల్ కమిషనర్ -1 కె.టి. సుధాకర్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యర్థులతో కలిసి ఆరోగ్యమే మహాభాగ్యం, ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచిలు ముద్దు అనే నినాదాలతో స్వచ్ఛత ర్యాలీ చేపట్టారు. ఎర్ర కట్ట డౌన్ లోనే పిచ్చి మొక్కలను పీకేసి ఆ ప్రదేశంలో మొక్కలు నాటారు. ఎర్ర కట్ట డౌన్ లో వి.ఎం.సీ. పార్క్ డివైడర్ కి అదనపు కమీషనర్ జనరల్ శ్రీమతి శ్యామల, రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యర్థులతో కలిసి పెయింటింగ్ ని వెయ్యడం జరిగింది.
చిట్టినగర్ కె.ఎల్.రావునగర్ నందు నగర పారిశుద్యంపై ప్రత్యేక శ్రద వహించి నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుటలో కమిషనర్, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమిష్టి కృషి చేసి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిటతో పాటుగా రాబోవు రోజులలో విజయవాడ దేశంలో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని ప్రజలు మరియు యువకులు కూడా నగరపాలక సంస్థ తో సహకరించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో స్వచ్చందంగా భాగస్వాములు కావాలని తమ వంతు కృషి చేయాలని అదనపు కమీషనర్ జనరల్ శ్రీమతి శ్యామల గారు అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసి క్లాత్ బ్యాగ్ లను వాడాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు గుడ్డ సంచి లను అందజేసి, వారు మరికొందరికి అవగాహన కలుగజేయలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్ ఓబెస్వర రావు గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, విద్యార్థులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.