-జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో శనివారం సాయంత్రం జిల్లా వైద్య శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ, ఇరిగేషన్ శాఖ, పంచాయితీరాజ్ శాఖలతో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా జక్కంపూడి కాలనీ లో మలేరియా వ్యాప్తి కంట్రోల్ చేయడానికి సమావేశం నిర్వహించినారు. బుడమేరు లో ఉన్నటువంటి గుర్రపు డెక్కను నిర్మూలించాలి, అలాగే దోమల లార్వా నిర్మూలనకై చర్యలు తీసుకోవాలని, అలాగే వరి పొలలల్లో లార్వా ను నిర్మూలనకై అగ్రికల్చర్ శాఖ వారు స్ప్రేయింగ్ నిర్వహించుట జరపాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించమైనది. అన్ని శాఖాల వారు కలిసి విధిగా కృషి చేస్తేనే మలేరియ వ్యాప్తిని నిర్మూలించగలమని జిల్లా కలెక్టర్ గారు అన్నారు.
నగరంలో ఎప్పటికప్పుడు యాంటి లర్వాల్ ఆపరేషన్ పనులకు సంబందించి కాలువలు మరియు మురికిగుంటలలో నీటి నిల్వ ఉండు ప్రదేశాలలో దోమల లార్వా నిర్మూలనకై చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం సక్రమముగా లేని మేజర్ డ్రెయిన్ మరియు ప్రధాన కాలువ అంచుల వెంబడి మలేరియ సిబ్బంది ద్వారా యం.ఎల్ ఆయిల్ స్ప్రేయింగ్ నిర్వహించుట జరపాలని జిల్లా కలెక్టర్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఆదేశించమైనది.
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ నగరంలో దోమల నివారణకై ప్రతి రోజు హ్యాండ్ మరియు లితో ఫోగ్గింగ్ యంత్రముల ద్వారా ఫాగింగ్ నిర్వహిస్తూ, నీరు నిల్వ యున్న ప్రదేశములలో ఆయిల్ బాల్స్ వేయుట, పి.డి.పి. వర్క్, లార్వా గుర్తించిన ప్రదేశాలలో మరియు కల్వర్డ్ ల క్రింద పై రత్రం పవర్ స్ప్రేతో స్ప్రే చేయించుట మొదలగు యాoటిలార్వల్ ఆపరేషన్స్ పనులు నిర్వహించుట జరుగుచున్నదని అన్నారు. దోమ లార్వా వృద్ది, నివారణకు తీసుకొనవలసిన జాగ్రత్త చర్యలపై సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి అవగాహన కల్పించే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో DMHO, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ఇరిగేషన్ శాఖ, పంచాయితీరాజ్ శాఖ, అగ్రికల్చర్ శాఖ వారు, హెల్త్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.