-విశాఖలో ఘనంగా ఎస్పీ బాలు రెండవ వర్ధంతి
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం స్మృత్యంజలి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్.కే.రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాక్మీ ప్రతాప్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ కళాభారతిలో బాలు రెండో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోజా మాట్లాడుతూ మంత్రి రోజా మాట్లాడుతూ బాలు గారు ప్రపంచ దేశాల్లో తెలుగు పాట ద్వారా మనందరికి గుర్తింపు తెచ్చారు. ఆయన మనల్నివదలి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మలేకపోతున్నాం. ప్రతిరోజు ఆయనపాట వింటూనే వుంటాం. లుగు పాట ఉన్నంతవరకు, తెలుగు మాట ఉన్నంత వరకు, తెలుగు గడ్డ ఉన్నంతవరకు తెలుగు కళామాతల్లి ముద్దుబిడ్డ అయిన బాలుగారు మనందరికి గుండెల్లో బ్రతికే వుంటారు. బాలుగారంటే ఒక వ్యక్తి కాదు…నిలువెత్తు సంస్కారం.. అటువంటి అద్బుతమైన గంధర్వ గానం మనందరిని వదిలేసి … ఇన్ని సంవత్సరాలుగా మనందరినీ అలరించానని ….. అందుకే ఆయన మనమధ్య లేకుండా దేవతల్ని కూడా అలరించేందుకు పైలోకాలకు వెళ్లిపోయారు. పాత తరాలు బామ్మ పాట వింటూ పెరిగాయి. మా తరం, ఇప్పటితరం బాలుగారి పాట వింటూ పెరుగుతున్నాయి. అమ్మపాలబువ్వ ఎంత కమ్మగా వుంటుందో బాలుగారి పాట అంతే కమ్మగా వుంటుంది. అందుకే నేను అంటాను…. అమ్మకు మించిన దైవం లేదు…బాలు కి మించిన గానం లేదు అని. అందరూ అంటారు…శ్రీపతి పండితారాధ్యుల అని, కాని నేను ఏమంటానో తెలుసా…స్వరాలపండితుడు అని, దాదాపు 45వేల పాటలతో, కుల,మతం ప్రాంతం లేకుండా అందరిని అలరించిన బాలుగారిని మరువలేం. మట్టిమీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి ఆశ… మన్నే చివరకి గెలిచింది మరణంతో. చివరికి మరణంతో… బాలుగారిని మన నుండి తీసుకెళ్ళింది. కానీ ఆ మట్టిమీద వున్న బాలు పేరును మాత్రం ఎన్నటికీ చెరిగిపోదు. ఆయన మాట,పాట,బాట, ఎప్పటికి చిరస్ధాయిగా వుంటుంది. ఆయన కీర్తి భవిష్యత్తు తరాలకు, ఆయన పాటలు, మంచితనం, సంస్కారం ఇవన్నీతెలియజేయాలి. ఆయనతో పరిచయం ఎవరు మరిచిపోలేరు. మా నాన్న, బాలు క్లోజ్ ప్రేండ్స్. నన్ను బాలు చూసినప్పుడల్లా రోజ్ రోజ్ రోజా పువ్వా.. రోజా పువ్వా అంటూ నేను దగ్గరికి వచ్చేవరకు పాడుతూ ఉండేవారు. ఇంకో విషయం ఏమంటే బాలు నగరిలోని పి.సి.ఎన్. స్కూలులోనే చదువుకున్నారు. ఆలాంటి నగరికి నేను ఎమ్మేల్యేగా వున్నాను. ఎంతో సంతోషం.. మా నగరి ప్రజలందరూ వినేలా ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను. సంస్కృతిక శాఖా మంత్రిగా వుంటూ ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా భావిస్తున్నానని మంత్రి రోజా తెలిపారు.