విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించే అయ్యప్ప మహా సంగమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఆదివారం సత్యనారాయణపురంలోని గాయత్రి కన్వెన్షన్ హాల్లో జరిగిన గురుస్వాముల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న విజయవాడ నగరంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించే అయ్యప్ప మహా సంగమం విజయవంతం చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు హామీ ఇచ్చారు. శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఎంతో మంది ఎదురుచూస్తుంటారని, అటువంటి వారి కోసం నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో అయ్యప్ప మహా సంగమంవంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ధర్మ ప్రచార సభ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, ప్రచార సభ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. కృష్ణన్న నంబు, గురు వాయుర్ దేవస్థాన ప్రధాన అర్చకులు శని నంబూద్రి, శబరిమలై ప్రధాన అర్చకుడు దామోదరం పొట్టి, నేషనల్ అధ్యక్షులు కె.అయ్యప్ప దాస్, భారతీయ ఉపాధ్యక్షులు లంక బాబు, ప్రధాన కార్యదర్శి బాల ఆంజనేయులు, ఓగిరాల రాజశేఖర్, ఆకెళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …