Breaking News

వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్  తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని, నవంబర్ నెలాఖరుకు పూర్తి అయ్యేలా ప్రణాళికాబద్దంగా పనులు జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని, డి.ఈ.ఈ.లు మరింత భాద్యతగా పనుల వేగవంతం పై కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని చెరువుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి, అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాల్సి ఉన్నందున ఎస్.ఈ.ని ప్రత్యక్షంగా చెరువులను సర్వేయర్, స్థానిక ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. డ్రైన్ల నిర్మాణ సమయంలో ఎక్కడైనా రైల్వే లైన్లు, జాతీయ రహదారి క్రాసింగ్ ఉన్న చోట సంబందిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పనులు వేగవంతం చేయాలన్నారు. నగరంలో ప్రధాన మరియు అంతర్గత రహదార్ల వెంబడి, నగరపాలక సంస్థ స్థలాలల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని, జంక్షన్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. అభివృద్ధి పనులకు టెండర్ పొంది పనులు చేపట్టని కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్ట్ లో చేర్చడం, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. సమావేశంలో ఈ.ఈ.లు కొండారెడ్డి, సుందర్రామిరెడ్డి, ఏ.డి.హెచ్. రామారావు, డిఈఈలు శ్రీనివాసరెడ్డి, రమేష్ బాబు, శివకుమార్, హనీఫ్ అహ్మద్, మహ్మద్ రఫిక్, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఏడెనిమిది వేల ఖాళీల భ‌ర్తీకి మంత్రి ఆదేశం

-ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌కు డాక్ట‌ర్లు, పేరా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం అవ‌స‌ర‌మ‌న్న మంత్రి -మంజూరైన పోస్టులు, ఖాళీల‌పై మంత్రి స‌త్య‌కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *