ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి రెండున్నర లక్షలు పైబడి భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. శనివారం ఇంద్రకీలాద్రి మీడియం సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ దృష్ట్యా అందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ విధమైన వాహనాలు కొండపైకి అనుమతించడం జరగదని తెలిపారు. అలాగే వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలు కూడా అక్టోబర్ 2న ఉండవని స్పష్టం చేశారు. ఉభయ దాతల పూజలకు 700 టికెట్లను మూలా నక్షత్రం రోజున ఇవ్వడం జరిగిందని, వారి పూజల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మధ్యాహ్నం మూడు గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉందన్నారు. నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా మాట్లాడుతూ మూల నక్షత్రం దృష్ట్యా నగరంలో కొన్ని ట్రాఫిక్ అంశాలను పెట్టడం జరుగుచున్నదన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి వినాయక టెంపుల్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి ప్రకాశం బ్యారేజీ వరకు, కుమ్మరిపాలెం నుండి మోడల్ గెస్ట్ హౌస్ వరకు వాహనాలకు అనుమతి లేదన్నారు. అలాగే నగరం వెలుపల కూడా వాహనాలు మళ్లింపు ఉంటుందని తెలిపారు.
Tags indrakiladri
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …