కూల్చిన బిపి మండల్ విగ్రహ పీఠాన్ని ప్రభుత్వమే నిర్మించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరులో బీ.పీ మండల్ యొక్క విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పీఠాన్ని కూల్చివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీ వి.యన్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల మనోభావాల్ని గుర్తించి బీసీలను అన్నిరంగాలలో ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వై.యెస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో గుంటూరులో బీసీల ఆరాధ్య దైవం బీ.పీ. మండల్ విగ్రహ ప్రతిష్టాపనకై ఉద్దేశించిన పీఠ విధ్వంసం యావత్భారత బీసీల మనోభావాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా మా బీసీ సమాజం భావిస్తోందని అన్నారు. ఒ.బి.సి సౌత్ రైల్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ వర్క్ షాప్ డివిజనల్ ప్రెసిడెంట్ యల్.యస్. ఆర్. కె ప్రసాద్ మాట్లాడుతూ సాక్షాత్తూ బి.పి. మండల్ మనుమడైన సూరజ్ మండల్ , బీసీ, ఎస్సీ మంత్రివర్యులూ మరియు ఇతర ప్రభుత్వాధికారులు సమయంలో ఎంతో ఘనంగా భూమిపూజ చేయగా భూమిపూజ జరిగిన మూడవ రోజునే ఆ పీఠాన్ని విద్వంసం చేయటం సమస్త బీసీ సమాజాన్నీ తీవ్ర అవమానానికి గురిచేయటమే కాకుండా అభద్రతాభావానికి లోనుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.బీ.పి. మండల్ కాంస్య విగ్రహాన్ని అలా వెంకటేశ్వరరావు నేతృత్వంలో గుంటూరులో ఏర్పాటు చేస్తుంటే విద్వంసం సృష్టించటం బీసీల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని దెబ్బతిన్న బీసీల ఆత్మగౌరవ తక్షణ పునరుద్ధరణలో భాగంగా భారతీయ రైల్వే మరియు భారత ప్రభుత్వంచే గుర్తించబడిన దక్షిణ మధ్య రైల్వే ఓబీసీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి ఈ క్రింది డిమాండ్లు చేస్తోంది. తక్షణమే విద్వసం జరిగిన చోటనే బి.పి.మండల్ విగ్రహ పీఠ పునర్నిర్మాణం గావించాలి మరియు విగ్రహ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టాలి. రాష్ట్ర రాజధానిలో ఏదైన ఒక ముఖ్య కూడలిలో బి.పి.మండల్ స్మృతివనం నిర్మాణం చేపట్టాలి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ బి.పి. మండల్ విగ్రహ నిర్మాణం చేపట్టాలి. అసెంబ్లీలో తీర్మానం చేపట్టి మండల్ పేరును భారతరత్నకి సిఫార్సు చేయాలి. బీసీలపట్ల ఇలాంటి నీతిబాహ్య చర్యలు పునరావృతం కాకుండా తక్షణమే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ వైస్ ప్రెసిడెంట్, కె.ఎం.కె.వి ప్రసాద్, జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, డివిజనల్ సెక్రటరీ ఎస్. అర్జునరావు మరియు వివిధ బ్రాంచ్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం

-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు  -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *