Breaking News

శారద విద్యా సంస్థల ప్రెషర్స్ డే సందడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మొగల్రాజపురంలో ఉన్న శారద విద్యా సంస్థల ” ప్రెషర్స్ డే ” సెలబ్రేషన్స్ శనివారం నగరంలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిధులుగా పద్మశ్రీ అవార్డ్ గ్రహీత డాక్టర్ ఎ.జి.కె గోఖలే (కార్డియాక్ సర్జన్ ), పి.హెచ్.డి రామకృష్ణ (డి.ఐ.జి) విచ్చేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కళాశాల చైర్మన్, డాక్టర్ వై రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాల విద్యార్థులకు విశిష్ట వ్యక్తులను పరిచయం చేసి అమూల్యమైన సందేశాలతో విలువైన సమాచారాన్ని అందిస్తూ ” ప్రెషర్స్ సెలబ్రేషన్స్ ‘ ఎంతో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. గడచిన 7 సంవత్సరాలనుండి కేవలం డేస్కాలర్స్ విద్యా సంస్థగానే, తమ విద్యార్థులు నుండి అత్యుత్తమ ఫలితాలను సాధించి, మంచి మెడికల్, ఇంజనీరింగ్ కాలేజిలలో సీట్లు సంపాదించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎ.జి.కె గోఖలే (కార్డియాక్ సర్జన్) మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందంటూ దేశాభివృద్ధి సాధించాలంటే ముందు మనం మారుతూ, సమాజాన్ని మార్చాలని, ప్రతి ఒక్కరు ధృడసంకల్పంతో ఉండాలని కోరారు. విద్యార్థి ఉజ్జ్వల భవిష్యత్తును రూపొందించే కేంద్రాలుగా ఉన్నటువంటి కళాశాలలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా సద్వినియోగపరుచుకుని, ఉన్నత విద్యలతో మహోన్నత పదవులను అధిరోహించి, ధర్మబద్ధతతో కూడిన సేవలను సమాజానికి అందించాలని సూచించారు.

అనంతరం పి.హెచ్.డి రామకృష్ణ (డి.ఐ.జి) మాట్లాడుతూ విద్యార్థులు ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన చిన్నతనం నుండే అలవరుచుకోవాలని, ఇతరులనుండి ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా, సేవాదృక్పథంతో ఉండాలని, నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకుంటూ సామాజిక అభివృద్ధికై పాటుపడాలని సూచించారు. విద్యార్థులు టెక్నాలజీని పరిమిత అవసరాలకు మాత్రమే వినియోగిస్తూ , మంచి విద్యార్థిగా రాణించాలని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ వై.శారదాదేవి మాట్లాడుతూ ప్రస్తుత విద్యాబోధనకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగిస్తూ నిబద్ధతో చదవాలి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, భావవ్యక్తీ కరణ, వివిధ నైపుణ్యాలు కల్గి ఉంటే భవిష్యత్తులో బాగా రాణిస్తారని, దానికి ప్రెషర్స్ లాంటివి మంచి వేదికగా ఉపయోగించుకోవాలి అన్నారు. తమ కళాశాల విద్యార్థులకు అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వ్రాసే విధంగా ఎప్పటికప్పుడు నూతన విద్యాప్రణాలికలతో, విద్యా భోదనలతో, క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, పిల్లల చదువు, వారి భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రుల పాత్రను తెలియజేయడానికి తల్లిదండ్రుల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులను కేవలం చదువు విషయంలోనే కాకుండా వారికి ఆసక్తి గల క్రీడా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్న నిర్వహిస్తున్నామని, సాంస్కృతిక రంగాలలో కూడా వారికి పాల్గోనే అవకాశం కల్పించటం కోసం ప్రెషర్స్ డే వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధికి వెన్నుతట్టి ప్రోత్సాహిస్తున్నామని కళాశాల అడ్వైజర్ ఈ.యస్.ఆర్.కె.ప్రసాద్ గారు తెలిపారు. మెమోరియల్ గోల్డ్ అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా , తమ ఆట పాటలతో “ ప్రెషర్స్ ” ను మరింత సందడి చేస్తూ సభాప్రాంగణాన్ని అలరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *