Breaking News

వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్‌ పునరుద్ధరించాలి… : బి.ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్‌ పునరుద్దించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ బోయ ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద వాల్మీకి సంఘం సత్యాగ్రహ దీక్ష గురువారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాల్మీకులను గిరిజనులు గానే పరిగణించి ఎస్టీ జాబితాలోనే ఉన్నారని అయితే ప్రాంతీయ వ్యత్యాసాలను సృష్టించి తమకు అన్యాయానికి గురి చేశారన్నారు. అప్పటి నుండి తాము అనేక పోరాటాలు చేశామని దాంతో 2017లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చడం జరిగిందని తమను కూడా చేర్చి న్యాయం చేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో కర్నూలు బహిరంగ సభలో వాల్మీకి లేదా బోయల చిరకాల వాంఛను అర్థం చేసుకున్నానని వారి న్యాయమైన కోర్కెను తీర్చేదినని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వాల్మీకి బోయల శాంతియుత నిహార దీక్షలో డిమాండ్‌ చేయుచున్నానని అన్నారు. తమకు సంఫీుభావాన్ని తెలిపేందుకు మిగతా ప్రాంతాల నుండి ప్రముఖులు, నాయకులు రాబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ చుట్టు ప్రక్కల ప్రాంతాలు వల్లూరిపాలెం, తదితర ప్రాంతాల నుండి వచ్చిన వాల్మీకి సంఘ నాయకులు బళ్లంపూరి శ్రీనివాసరావు, పిక్కిని రత్తయ్య, రామతారకం, ఎ.వినయ్‌, సగరం శ్రీను, ఉండ్ర శ్రీరాములు తదితరులు స్థానిక నాయకులు జగదీష్‌, భాను ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *