Breaking News

ప్రాదాన్యత భవన నిర్మాణాలను నిర్దేశించిన కాలంలోగా పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాదాన్యత భవన నిర్మాణాలను నిర్దేశించిన కాలంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్లుల ప్రస్తుత ప్రగతిని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు శుక్రవారం ఆర్డీవోలు ,స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహాసిల్దార్లు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలను నవంబర్ 30 నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. జిల్లాలో 268 గ్రామ సచివాలయాలు, 260 రైతు భరోసా కేంద్రాలు, 239 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు చేపట్టవలసి ఉండగా వీటిలో ఇప్పటికే 156 గ్రామ సచివాలయాలు, 85 రైతు భరోసా కేంద్రాలు, 62 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినికల్ నిర్మాణాలు పూర్తిచేయడం జరిగిందన్నారు. నేటి వరకు ప్రారంభం గానీ బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న 83 గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లుల నిర్మాణాలను త్వరిత గతిన ప్రారంభించాలన్నారు.బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న 194 భవనాలను రూప్ లెవెల్ స్థాయికి, రూప్ లెవెల్ స్థాయిలో ఉన్న 44 భవనిర్మాణాలను ఫినిషింగ్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఫినిషింగ్ స్ధాయిలో ఉన్న 39 భవనిర్మాణాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. వివిధ కారణాలతో నిర్మాణాలను చేపట్టని భవనాలను ముఖ్యంగా కోర్టు కేసులు, లోలేవెల్ ఉన్న స్థలాలలో మెరక చేయటం తదితర సమస్యలను త్వరిత గతిన పరిష్కరించి ప్రారంభింప చేయాలని కలెక్టర్ అన్నారు. బిల్లుల చెల్లింపులకు జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు స్టేజి వారిగా అప్లోడ్ చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *