బ్లడ్ గ్రూపులు వేరైనా.. విజయవంతంగా కిడ్నీ మార్పిడి…


-డాక్టర్ శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీలో అరుదైన చికిత్స
-అత్యంత క్లిష్టమైన ఎబిఒ ఇన్కంపేటబుల్ విధానంలో కిడ్నీ మార్పిడి
-అరుదైన చికిత్సలో 14 ఏళ్ల బాలికకు పునర్జీవితం
-బ్లడ్ గ్రూపులు వేరైనా కిడ్నీ మార్పిడి సాధ్యమేనని మరోసారి నిరూపించిన ప్రఖ్యాత కిడ్నీ మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ జి. శరత్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కిడ్నీలు దెబ్బతినడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాలికకు డాక్టర్ శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ వైద్యులు పునర్జీవితం అందించారు. అత్యంత సంక్లిష్టమైన ఎబిఒ ఇన్కంపేటబుల్ విధానంలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ జి. శరత్ బాబు.. బ్లడ్ గ్రూపులు వేర్వేరుగా ఉన్నప్పుటికీ కిడ్నీ మార్పిడి సాధ్యమేనని మరోసారి నిరూపించారు. సూర్యారావుపేటలోని శరత్ ఇనిస్టిట్యూట్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ జి. శరత్ బాబు ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మూత్రపిండాలు పూర్తిగా పాడైన స్థితిలో 14 ఏళ్ల బాలికను శరత్ ఇనిస్టిట్యూట్ కు తీసుకొచ్చారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. డయాలసిస్ లేకుండా ప్రీఎంప్టివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. కిడ్నీ దానం చేసేందుకు కుటుంబసభ్యులందరినీ పరీక్షించినప్పటికీ సరిపోలకపోవడంతో, బాలిక అమ్మమ్మ కిడ్నీ దానం చేసేందుకు ముందుకువచ్చారు. అయితే, పేషేంటుంది ‘ఒ’ బ్లడ్ గ్రూపు కావడంతో సందిగ్ధత ఏర్పడింది. సాధారణంగా కిడ్నీ మార్పిడి చికిత్సల్లో ‘ఒ’ గ్రూప్ బ్లడ్ వాళ్లు ఏ ఇతర బ్లడ్ గ్రూపు వారికైనా కిడ్నీ దానం చేయవచ్చు. ఎబి బ్లడ్ గ్రూపు వారు ఏ ఇతర బ్లడ్ గ్రూపుల వారి నుండైనా కిడ్నీని పాండవచ్చు. కానీ ‘ఒ’ బ్లడ్ గ్రూపు వారు మాత్రం అదే గ్రూపు వారి నుండే కిడ్నీ పొందాలి. కిడ్నీ దాత అయిన పేషేంట్ అమ్మమ్మ ‘బి’ గ్రూప్ అయినప్పటికీ, అనేక ముందస్తు చికిత్సల అనంతరం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కిడ్నీ మార్పిడి చికిత్సల్లో విశేషానుభవం కలిగిన డాక్టర్ శరత్ బాబు.. ఇన్కంపేటబుల్ విధానం ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను పూర్తి చేశారు. కిడ్నీ మార్పిడికి ముందస్తు చికిత్సల్లో భాగంగా పేషేంటుకు ముందుగా ఇమ్యునోఅడ్సాప్ర్షన్ పద్ధతిలో బి గ్రూపు యాంటీబాడీలను 1:4 స్థాయికి నియంత్రించగలిగారు. యాంటీబాడీలు సురక్షిత స్థితికి చేరిన అనంతరం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. కిడ్నీ మార్పిడి అనంతరం పేషెంటుతో పాటు, కిడ్నీ దానమందించిన ఆమె అమ్మమ్మ కూడా ఆరోగ్యం ఉన్నారని, త్వరలోనే వారిని డిశ్చార్జి చేస్తున్నామని డాక్టర్ శరత్ బాబు తెలియజేశారు. సాధారణ కిడ్నీ మార్పిడి చికిత్సలతో పోల్చితే, ఈ తరహా కేసుల్లో రిస్క్ అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. ‘ఒ’ బ్లడ్ గ్రూపు వారిలో ‘బి’ గ్రూపు యాంటీబాడీలను నియంత్రించకుండా కిడ్నీ మార్పిడి చేసినట్లయితే, కిడ్నీ తిరస్కరణకు గురై ఆపరేషన్ టేబుల్ పైనే పేషేంట్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. తమ హాస్పిటల్లో ఇప్పటివరకు వందలాది కిడ్నీ మార్పిడి చికిత్సలను నిర్వహించామని, వేర్వేరు గ్రూపులున్న వారికి కిడ్నీ మార్పిడి చేయడం ఇది ఆరోసారని అన్నారు. కుటుంబసభ్యుల బ్లడ్ గ్రూపులు సరిపోలకపోవడం, అదే బ్లడ్ గ్రూప్ దాతలు అందుబాటులో లేకపోవడం వల్ల కిడ్నీ మార్పిడి చికిత్సలకు ఆటంకం కలుగకుండా, ప్రస్తుతం అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దాత, గ్రహీతలు బ్లడ్ గ్రూపులు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్లడ్ గ్రూపులు వేరైనప్పటికీ ఎబిఒ ఇన్కంపేటబుల్ విధానంలో కిడ్నీ మార్పిడి సాధ్యమేనని తెలిపారు. శరత్ ఇనిస్టిట్యూట్లోని అత్యాధునిక నెఫ్రాలజీ, యురాలజీ విభాగాల ద్వారా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని డాక్టర్ శరత్ బాబు వివరించారు. ఈ సమావేశంలో శరత్ ఇనిస్టిట్యూట్ ఎండీ వెంకట్రావు, రేడియాలజిస్ట్ డాక్టర్ ప్రశాంతి, యురాలజిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *