గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేకుండా వెంచర్లు లేదా లే అవుట్లు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగింపు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ చౌడవరంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ ని తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే సంబందిత ప్లానింగ్ కార్యదర్శి, పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చౌడవరంలో వెంచర్ ని పరిశీలించి, రోడ్లు, ఓపెన్ స్పేస్, గ్రీనరి, డ్రైన్ల ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకొని, రోడ్ల కొలతలను నేరుగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణ ప్రణాలిక అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనల మేరకే వెంచర్లకు అనుమతులు ఇవ్వాలని, అందుకు తగిన విధంగానే పట్టణ ప్రణాలిక అధికారులు నేరుగా పరిశీలించాలన్నారు. నిబందనల మేరకు లేని వెంచర్లకు అనుమతులు మంజూరు చేయబోమన్నారు. పర్యటనలో సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి. అశోక్ కుమార్, టి.పి.ఎస్. లక్ష్మణ స్వామి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …