యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  వారి ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా పోటీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పి బి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నందు నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవంలో  ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ భారత దేశం యోగ జన్మస్థలమని,  శరీరం మరియు ఆత్మ కలయికే యోగా అని, యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, యోగా ప్రాముఖ్యత ను గురించి  తెలిపారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో  పాల్గొన్న మాజీ డిజిపి ఎం వి రావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎస్ఐబి డిప్యూటీ డైరెక్టర్ అభిషేక్, వై ఎస్ ఏ ఎపి ప్రెసిడెంట్ రాధిక, రిటర్నింగ్ అధికారి గొట్టిపాటి రామకృష్ణ, జనరల్ సెక్రటరీ అమిత్ పి గోతి, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ కొంగర సాయి, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *