విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులకు సూచించారు. డిస్టిక్ కంన్జుమర్ ప్రోటషన్ కౌన్సిల్ (జిల్లా వినియోగదారుల రక్షణ మండలి) తొలి సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళివెంకయ్య సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షులు ఎస్. డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం 1986లో చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. 2019లో చట్టంలో కొన్ని సవరణలు చేసి 2019 సంవత్సరంలో నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని 2020 జూలై మాసం నుండి నూతన చట్టం అమలు లోకి వచ్చిందన్నారు. వినియోగదారుల రక్షణ కొరకు ఉద్దేశించిన చట్టం గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. లఘ చిత్రాలు, వాల్‌పోస్టర్లు, కర్రపత్రాల ద్వారా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, జ్యుయలరీ షాపులు కళాశాలలో వినియోగదారుల రక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. గతంలో వినియోగదారుడు వస్తువును ఎక్కడ కొనుగోలు చేస్తే అక్కడే ఫిర్యాదు చేయవలసి వచ్చేదని, నూతన చట్టం ప్రకారం దేశంలో వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినా వినియోగదారుడు నివాసం ఉంటున్న చిరునామ ప్రాంతంలోనే ఫిర్యాదు చేసే అవకాశం నూతన చట్టం కల్పించిందన్నారు. ప్రోడక్ట్‌లో ఎటువంటి లోపం ఉన్న దానిని తయారు చేసిన తయారు దారుడుతో పాటు విక్రయించిన వారు ప్రచారం నిర్వహించేవారు కూడా భాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. నూతన చట్టం ప్రకారం వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులలో నాణ్యత లోపం ఉంటే 21 రోజుల లోపు స్థానిక వినియోగదారుల కోర్టు నందు పిర్యాదు చేయవలసి వుంటుందన్నారు. వినియోగదారుడు కొన్న వస్తువులకు సంబంధించి బిల్లులతో పాటు ఎఫిడవిట్ దాఖలు చేయాలసి వుంటుందన్నారు. వినియోగదారుడుకు స్థానిక కోర్టులో జాప్యం ఎదురైతే వినియోగదారుల రక్షణ మండలి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సాద్యమైనంత త్వరలో కేసును పరిష్కరించి వినియోగదారునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లీగల్ మెట్రోలజీ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించి తూనికలు, కొలతలు, వస్తువుల నాణ్యత వంటి విషయాలలో వినియోగదారులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లీగల్ మెట్రోలజీ, ఫుడ్ సేప్టీ శాఖల అధికారులు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను రూపొందించి వినియోగదారుల నుండి ఫిర్యాధులను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు పాఠశాలలో కంజ్యూమర్ క్లబులను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్,వైస్ చైర్మన్ ఎస్. నుపూర్ అజయ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, కన్వినర్ టి. కోమలిపద్మ, వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు కె. వెంకటేశ్వరరావు, కె. శ్రీనివాసరావు, యం బాస్కర్, డా. తరుణ్, కె.వి.వి. ప్రసాద్, కృష్ణమోహన్, మహ్మామద్ బాబి, ఎ. రత్నలక్ష్మి, డియంహెచ్ డా. యం సుహాసిని, లీగల్ మెట్రోలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎ. కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …