Breaking News

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ భీమా కార్యాలయం చిరునామా మార్పు…

ఏలూరు/కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉన్న తొమ్మిది మండలాలకు చెందిన ఏ పి జి ఎల్ ఐ పాలసీలు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏలూరు కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా ప్రభుత్వ బీమా కార్యాలయం ఉప సంచాలకులు దౌలూరి అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ బీమా కార్యాలయం  నండూరి మాన్షన్, ఆర్ఆర్ పేట, ఏలూరు నందు కొనసాగుచున్నదన్నారు. ఇకపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 46 మండలాలు పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ భీమా కార్యాలయం చిరునామా మార్పు ను గమనించాలని ఆయన కోరారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ ఆవరణలోని చిరునామా మార్పు చేసినట్లు తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం భీమా కార్యాలయాన్ని ఏలూరు జిల్లా, ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్, రెండవ అంతస్తు లోకి మార్చినందున ఉద్యోగులు ఈ మార్పు గమనించాలని కోరారు. నూతన తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చిన కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉన్న కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం, దేవరపల్లి, నల్లజెర్ల మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు వారి బాండ్ల కు సంబంధించి ఉత్తర, ప్రత్యుత్తరములకు ఏలూరు లోని నూతన చిరునామాకు పంపవలసిందిగా జిల్లా ప్రభుత్వ భీమా కార్యాలయం ఉప సంచాలకులు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *