చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
సొంత తోబుట్టువు కంటే మిన్నగా సంక్షేమ పథకాలను మహిళలు పేరున అందిస్తూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్న జగనన్న కు మద్దతుగా నిలవాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మహిళలు, బాలికలతో ముచ్చటించారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను మహిళలు, తోబుట్టువుల పేరున అందించడం జరుగుతోందన్నారు. చిన్నారులకు యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, షూస్, వంటివి అందజేస్తున్నారని, మీరు బాగా చదువుకుని జగన్ మావయ్యకి మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ప్రతి పథకం లో మహిళలు పేరునే ఇవ్వడం, ఇళ్ళ స్థలాల ను కూడా మహిళలకు ఇస్తున్నామన్నారు. వై ఎస్ ఆర్ చేయూత ద్వారా 45-60 మధ్య ఉన్న మహిళలకు అండగా ఉండేందుకు ఒక్కొక్కరికి రూ.18750 చొప్పున 4 సంవత్సరాలు కాలంలో రూ.75 వేలు ఇవ్వడం ద్వారా జీవనోపాధికి భరోసాగా మన జగనన్న ప్రభుత్వం నిలిచిందని హోం మంత్రి అన్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి ఆ కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ద్వారా గత మూడు సంవత్సరాలుగా పొందిన లబ్దిని మంత్రి చదివి వినిపించారు.
గడప గడపకు పర్యటన లో మంత్రికి ప్రజలు, పిల్లలు, పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చాగల్లు మండలంలోని 3577 మంది లబ్ధిదారులకు రు.6,71 కోట్లు మేర చేయూత ప్రయోజనం కల్పించామన్నారు. ఈ కార్యక్రమం లో లకంసాని సూర్యప్రకాశరావు చెల్లింకులు దుర్గా మల్లేశ్వరరావుచంద్రవరం గ్రామ సర్పంచ్ మద్దిపాటీ శ్రీరా మమూర్తి బండి అశోక్ గుమ్మడి శైలజనాథ్ నాగేశ్వరరావు కాoకటాల శ్రీనివాస్ గెడ శ్యామ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.