-పోణంగి బాల భాస్కరరావు, పోణంగి లక్ష్మి సత్యవతి దంపతుల ఔదార్యం..
-సన్మానించిన కలెక్టర్, జేసీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు శ్రీనివాసనగర్ కు చెందిన పోణంగి బాల భాస్కరరావు, పోణంగి లక్ష్మి సత్యవతి దంపతులు తమ ఔదార్యంతో కొవ్వూరు మెయిన్ రోడ్డు నందు విక్టర్ బజారుకు ఎదురుగా గల 700 చదరపు గజాల స్థలాన్ని ఉచితంగా అందచేశారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ స్పందన హాలులో పోణంగి బాల భాస్కరరావు, పోణంగి లక్ష్మి సత్యవతి దంపతులను కలెక్టర్, జేసీ లు ఇరువురుని సన్మానించి, వస్త్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మనకి ప్రభుత్వాలు ఎన్నో సేవలను వివిధ రకాలుగా అందిస్తోందని, మనం కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వవలసిన సామాజిక బాధ్యత ఉందన్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్న పోణంగి దంపతులు సుమారు రు. కోటి రూపాయలు విలువుగల 700 చదరపు గజాల వారి సొంత భూమిని ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా 700 గజాల స్థలాన్ని పోణంగి బాల భాస్కరరావు, పోణంగి లక్ష్మి సత్యవతి దంపతులు హాజరై ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేసిన డాక్యూమెంట్స్ పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత భవనాల కోసం గానీ, ఇతర అవసరాలకు వినియోగించుకోవడం కోసం ఈ స్థలాన్ని ఉచితం గా ఇస్తున్నట్లు దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ . శ్రీధర్ లు దంపతులను పట్టు వస్త్రాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి. నరసింహులు, కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీఓ లు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News