విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హైటెన్షన్ అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటులో విద్యుత్ సంస్థ నుండి రైతులకు నష్టపరిహరపు చెల్లింపులో తగు న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అన్నారు. విజయవాడ నుండి గుండుగొలను వరకు జాతీయ రహదారి-16లో విద్యుత్ సంస్థ హైటెన్షన్ అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటుకు సంబంధించి రైతులకు నష్టపరిహరపు చెల్లింపులపై బుధవారం నగరంలోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో గొల్లపూడి, జక్కంపూడి రైతులు, విద్యుత్ అధికారులతో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ నుండి చిన్నఅవుటుపల్లి, గొల్లపూడి మీదుగా గుండుగొలను వరకు విద్యుత్ సంస్థ హైటెన్షన్ అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటుకు సంబంధించి రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని విద్యుత్ సంస్థ నష్టపరిహరపు చెల్లింపులో తగు న్యాయం చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అన్నారు. సమావేశంలో విజయవాడ రూరల్ తహాశీల్థార్ శ్రీనివాస్‌నాయక్, విద్యుత్ సంస్థకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …