రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరుగురు లబ్ధిదారులకు రూ.14.25 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య సేవలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న కే చెల్లిందని పేర్కొన్నారు. వైద్య ఖర్చులు చేసిన ఆయా పేద కుటుంబాలకు చేదోడుగా నిలిచే విధంగా చాగల్లు, కొవ్వూరు మండలాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.14,25,000 ల సి ఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేసిన చెక్కును అందజేశామన్నారు. చాగల్లు కి చెందిన ముగ్గురికి, పసివేదల, మలకపల్లి, ధర్మవరం లకు చెందిన ఒకొక్కరికి ఆయా మొత్తాలు చెక్కు రూపంలో పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …