విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన చేయడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోగలమని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అన్నారు. స్థానిక గుణదల ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల బాలికల వసతి గృహాన్ని గురువారం జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీ రావు పరిశీలించి విద్యార్ధునులతో సబ్జెక్టులవారిగా ముఖాముఖి నిర్వహించారు. వసతి గృహంలో ఉంటున్న 102 మంది విద్యార్థులతో వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో అందిస్తున్న సౌకర్యాలను, ముఖ్యంగా త్రాగునీరు, మెనూ ఆహారాన్ని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయారంగాలలో రాణించాలంటే కష్టపడి చదివిసబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు. ప్రస్తుత పోటీ వాతావరణంలో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ గ్రామర్ పై పట్టు ఉండాలన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ బోధించేలా ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ అన్నారు. సబ్జెక్టులను ఏకాగ్రతతో శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలన్నారు. గంటకు పైగా విద్యార్థులతో విద్యాపరమైన విషయాలపై ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ ,సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ గ్రామర్ పై ప్రశ్నలను అడిగి వారిచ్చిన సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహ పరిశీలనలో కలెక్టర్ తో పాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్ .లక్ష్మీ దుర్గ. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వి. హరిబాబు, వసతి గృహ సంక్షేమ అధికారి ఏ రజిని కుమారి ఉన్నారు.
Tags vijayawada
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …