-ఇంటికి దీపం ఇల్లాలు పేద కుటుంబాలకి మంచి చెయ్యా లనే సంకల్పం తో మహిళల పే రునే అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం…
-రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద వర్గాల ప్రజలకు అందించే విధం గా సిఎం ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు.
గురువారం చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొ న్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లాలో 88, 356 మందికి 3వ విడత ద్వారా ₹.165.67 కోట్ల మేర వై ఎస్ ఆర్. చేయూత పథకం ద్వారా లబ్ది చేకూరుతొం దన్నారు. అన్నీ వర్గాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు ఆయా పేద, నిరుపేదల కుటుంబాల , మహిళల ఆర్థిక సాధికారత కోసం నవరత్నాలు పధకము లను, గత మూడు సంవత్స రాలుగా వైఎస్ఆర్ చేయూత ను అమలు చేయడం జరుగు తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, కరోనా విపత్తు వచ్చి ఆదాయ వనరులు లేక పోయి నా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు, వై.ఎస్.ఆర్. చేయూ త వంటి పధకాలు అమలు చేస్తున్నామని మంత్రి వనిత అన్నారు. వై ఎస్ ఆర్ చేయూ త” పధకం ద్వారా జీవనోపాధిని ప్రోత్సహించడం లో భాగంగా రిటైల్ వ్యాపార రంగంలో ఉన్న అర్హులైన పేద నిరుపేద మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపడం జరుగుతోందన్నారు. నేడు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం తో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయి కు చేరుకో గలిగారు అంటే జగనన్న కి వారిపై ఉన్న నమ్మకం కారణం అన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు, నానుడిని సార్థకం చేసే విధానం లో జగనన్న సంకల్పం తో నేడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల లోని 45-60 సంవత్సరాలు మధ్య ఉండే వారికి రూ.165.67 కోట్ల ప్రయోజనం పొందగలిగారన్నా రు. నిర్దుష్టమైన జీవనోపాధి కోసం ఈ మొత్తాలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. గత మూడు సంవత్స రాలుగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మై నార్టీ మహిళల ఆర్థిక వెనుక బడిన వర్గాల వారికి కుల మత, ప్రాంత, రాజకీ యాలకి అతీతం గా అర్హులకు అందించడం జరిగిందన్నారు. వైయస్ జగ న్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుల, మత, పార్టీ, రాజకీయాలనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతు న్నాయని పేర్కొన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, 60 సంవత్సరాలు నిండి తే పెన్షన్ అందిస్తున్నా మని తెలిపారు. అంతేకాకుండా చేయూత కాపు నేస్తం, రైతు భరోసా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మని అన్నారు. మహిళలు రథసారథులని చేయూత పధకం ద్వారా మహిళలకు ఆర్థి క సహాయం తో పాటు ఆయా కుటుంబాల జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ. యం. సి. చైర్మన్, వల్లభ శెట్టి శ్రీనివాస్, యం. పి. పి., మట్టా వీరా స్వా మీ, జిల్లా పరిషత్ వైస్ ఛైర్ పర్శన్ పోసిన శ్రీ లేఖ, మండల తాహిసీల్దార్ శ్రీనివాస్, బండి పట్టాభి రామారావు, పలువురు సర్పంచ్ లు, యం. పి. టి. సి. లు, వి. సాయి బాల పద్మ, ఎంపీటీసీ లు, , ఆతుకూరి దొరయ్య, లకంసాని సూర్యప్రకా శరా వు,పోసిన శ్రీకృష్ణదేవరా య లు,బండి పట్టాభి రామా రావు ముదునురు నాగ రాజు,ఎం పీడీవో బి రామ్ ప్రసాద్, సచి వాలయం,రెవె న్యూ అధికారు లు తదితరులు పా ల్గొన్నారు.