విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తో బ్రిటీష్ డిప్యూటి హైకమీషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. గురువారం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న డిప్యూటి హైకమీషనర్ బృందానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. దర్బార్ హాలు వేదికగా రాష్ట్ర గవర్నర్, బ్రిటీష్ డిప్యూటి హైకమీషనర్ ల నడుమ అరగంటకు పైగా జరిగిన సమావేశంలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు, విభిన్న అంశాలలో అమలవుతున్న సంయిక్త ప్రాజెక్టులపై వీరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకించి రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ది, ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న విధానం బాగుందని బ్రిటీష్ డిప్యూటి హైకమీషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ స్దాయి సంస్ధలు, వాటి ఉన్నతిని గురించి మాట్లాడుతూ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను సైతం ప్రయోగిస్తున్న తీరును గవర్నర్ హరిచందన్ వివరించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …