-జాబ్ మేళాలో 75 కంపెనీల్లో 2700 మంది కి ఉద్యోగాలు …
-మరికొందరికి ఉపాధి కల్పన దిశగా యువత నైపుణ్యం పెంచు కోవాలి
-జాబ్ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా పరిశ్రమల స్టాల్
-ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత
-జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత
-యంపి మార్గాని భరత్ రామ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యువత చదువు పూర్తయిన తరువాత వారి భవిష్యత్తును ఎన్నుకొనేందుకు ఏ రంగంలో స్థిరపడాలనే సందేహం కలుగుతుందని వారి బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు చేపట్టిన మెగా జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు యువతకు ప్రభుత్వం అందచేస్తున్న ప్రతీ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ కోరారు.
శుక్రవారం స్థానిక మార్గాని భరత్ రామ్ ఎస్టేట్ నందు వివిధ కంపేనీలు, పరిశ్రమలు శాఖ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు ఏర్పాటు కోసం మెగా జాబ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టరు మాధవీలత స్థానిక ఎంపి. భరత్ రామ్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టరు డా. కె.మాధవీలత మాట్లాడుతూ, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలను అందించేందుకు ఒకే వేదిక పై పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా ను అతి తక్కువ సమయంలో ఎంపి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ జాబ్ మేళాకు వివిధ రంగాలకు సంబందించిన 75 కంపెనీలు వచ్చాయని ఇందులో సుమారు 4 వేలమందికి పైగా యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు నిర్వహించారని తెలిపారు. ఇప్పటి వరకు 2700 మంది అభ్యర్థులు ఆయా కంపెనీల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు. తల్లితండ్రులు వారి పిల్లల భవిష్యత్తు అభివృద్ది కోసం ఆలోచన చేసి ఆయా కంపేనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడేందుకు పంపించేందుకు సహకరించాలన్నారు. జాబ్ మేళాలో ఎంపిక కాని వారు నిరూత్సాహం పడనవరం లేదన్నారు. మరో మూడు మాసాల్లో జాబ్ మేళా నిర్వహిస్తామని కలెక్టరు తెలిపారు. జాబ్ మేళా తో పాటు ఇండస్ట్రియల్ ఎక్స్ పోర్టు ఉద్యోగాలతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక యువతను ఒకే వేదికపై తీసుకుని వచ్చి ప్రోత్సహించడం మంచి కార్యక్రమం అన్నారు. పరిశ్రమలు శాఖ, నైపుణ్యాభివృద్ధి తదితర విభాగాలు అందరూ ఈ వేదిక పైనే ఉన్నారన్నారు. నైపుణ్యం అవసరం యున్న యువతకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు చాలా పెద్దపీట వేస్తున్నారని, నాడు.. నేడు ద్వారా పాఠశాలలు, కళాశాలలు అభివృద్ది వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. డిగ్రీ చదివే విద్యార్థులందరూ ఇటువంటి జాబ్ మేళాలో వారి ప్రతిభను కనబరిచేందుకు ఈ ఏడాది నుంచి డ్రిగ్రీ రెండవ సంవత్సరంలో రెండు మూడు మాసాలు lస్కిల్ డవలఫ్మేంట్ లో విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. జాబ్ మేళా ద్వారా ఉపాధి పొందిన వారు వారి భవిష్యత్తును బంగారు బాటలుగాతీర్చి దిద్దుకోవాలని కలెక్టరు అన్నారు. రాజమహేంద్రవరంలో సాప్ట్ వేర్ టెక్నాలజి పార్కు ఏర్పాటుకు ఏస్టీపిఐ రెండు ఎకరాలు అందించేందుకు భూసేకరణ చేసి అందించనున్నామని కలెక్టరు ఈ సందర్భంగా తెలిపారు.
యంపి భరత్ రామ్ మాట్లాడుతూ జాబ్ మేళాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని ప్రతి నెల రెండవ వారం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగం రాలేని వారు ఎవరూ అధైర్య పడవద్దని, వారికి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు ముద్ర లోన్స్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ లో సబ్సిడి వస్తుందని దీనిపై దృష్టి సారించాలని యంపీ బ్యాంకర్లను కోరారు. గ్రూపు సభ్యులుగా ఏర్పడిన స్వర్ణకారులకు పెట్టుబడి నిధిగా రు.5 లక్షల మేర బ్యాంకుల నుంచి ముద్ర రుణ సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రభుత్వం తరుపు నుంచి వికాస్, స్కిల్ డవలప్మెంట్, పరిశ్రమలు, ప్రమోషన్ ఎక్స్ పోర్టు వారందరు ఒకే వేదిక పై భాగస్వామ్యులు అవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నగరపాలక సంస్థ కమీషనరు కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ సొంతంగా స్కిల్స్ నెర్చుకున్న ప్రతి ఒక్కరూ ప్రవేట్ సెక్టారుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. మన దేశం అభివృద్ది చెందుతున్న దేశం అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతుంది కనుక సిల్స్ ఉన్న యువతకీ ఎన్నో అవకాశాలు లభిస్తాయని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత దేశం వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసు రంగాలుండుగా నేడు నాలెడ్జి ఎకానిమీలో ఉన్నామన్నారు.
రూడా చైర్ పర్సన్ షర్మిళా రెడ్డి మాట్లాడుతూ యువత ఆర్థికంగా, సమాజకంగా ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో చేయూత నిస్తుందని ప్రతి ఒక్కరూ ఇటువంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటులు వేసుకోవాలన్నారు.
జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందింస్తున్న స్టాండ్ అప్ ఇండియా , పీయం ముద్రస్కీమ్, పియంఇజీపి పథకం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న బడుగు వికాసం పథకాన్ని ఎస్టీ ఎస్సీ లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో 45 శాతం రాయితీతో పాటు బాంక్ రుణ సౌకర్యం పావలా వడ్డీకే అందించడం జరుగుతుందని, విద్యుత్ పై రూ. 1.50 రూపాయలు రాయితీ, నూరు శాతం జిఎస్టీ రాయితీ ఉంటుందన్నారు. పియంఇజీపి పథకం సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి రూ. 9.5 లక్షల నుంచి 23 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని, ఇందులో ప్రాజెక్టు ఖర్చులో 13 నుంచి 35 శాతం వరకు సబ్సిడీ ఉంటుందని తెలిపారు.
జాబ్ మేళా కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, రూడా చైర్ పర్శన్ షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మేల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, డి ఐ ఓ కే. వేంకటేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, వివిధ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.