విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని, సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ 13వ సచివాలయం పరిధిలోని గుణదల సెంటర్,విష్ణు నగర్ రోడ్,బైబిల్ స్కూల్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదు అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కృషి చేస్తుంటే ఓర్వలేని తెలుగుదేశం పార్టీ,ప్రతిపక్షాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మెనిఫెస్టో లో చెప్పిన విధంగా నవరత్నాలు అమలు చేస్తూ 95శాతం పైగా హామీలు నెరవేర్చిన ఘనత జగన్ దే అని అన్నారు. గత ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అధికార పార్టీకి చెందిన వారు అయ్యుండి కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు అని ,ఈ ప్రభుత్వం వచ్చిన తరువాతే రోడ్లు, సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా బాగుపడింది అని ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.వీలైనంత త్వరగా పుల్లేటి కాలువ సమస్య పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,వైసీపీ నాయకులు ఏలూరి శివాజీ,జెట్టి సత్యనారాయణ,రాజా,డేవిడ్ రాజు,భీమిశెట్టి నాని,శేషు,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …