Breaking News

పేద ప్రజలకు అండగా “దేవినేని నెహ్రు ట్రస్ట్” : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పుట్ట రోడ్డుకి చెందిన ప్రదీప్ బ్రెయిన్ స్ట్రోక్ తో అకస్మాత్తుగా మరణించగా సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ అవసరాల కోసం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొత్తం రూ:1,00,000/- నగదును వారి భార్య నాగ రజనీ కి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు.అదేవిధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ నందు ఇంటింటికి పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ నజీమా క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం అవినాష్ దృష్టికి రాగా వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు నిమిత్తం రూ:10,000/- నగదును ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పేదవాడికి అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని,ముఖ్యమంత్రి జగనన్న ను ఆదర్శంగా తీసుకొని విజయవాడ నగరంలో మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు,గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నపప్పుడు మా దృష్టికి వచ్చిన పేదవారి ఆరోగ్య అవసరాల కోసం ఆర్థిక సహాయం చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,వైసిపి నాయకులుకాటూరు బాబి,ఆకుల బాలాజీ,వెంకట్ రెడ్డి వెంకయ్యనాయుడు,ఆళ్ల శీను,వీరయ్య,ఇంటి రవి,రామ లక్ష్మణ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *