విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిన్నా చిత్రం ప్రచారంలో భాగంగా విజయవాడ విచ్చేసిన హీరో మంచు విష్ణు మరియు చిత్ర యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ నివాసానికి వెళ్లగా వారికి ఆయన ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మంచు విష్ణు కుటుంబంతో మా కుటుంబానికి మొదటి నుండి ఎంతో సాన్నిహిత్యం ఉందని అన్నారు.ఈరోజు చిత్ర యూనిట్ ను కలవడం సంతోషం గా ఉందని,జిన్నా సినిమా ఘన విజయం సాధించి ఈ చిత్రం కొరకు పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని అవినాష్ ఆకాంక్షిస్తూ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …