-గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట …
-అడుగడుగునా సంక్షేమం… అభివృద్ధి… లక్ష్యంగా పాలన…
-గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు…
-జగనన్న పాలనలో గ్రామా ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు..
-జగనన్నది రైతు పక్షపాతి ప్రభుత్వం…
-రైతుల ముసుగులో ప్రతిపక్షాలు రాక్షస క్రీడ చేస్తున్నాయి…
-రైతన్నల సంక్షేమం కోసమే రైతు భరోసా కేంద్రాలు…
-మూడేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాపాక గ్రామంలో వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం మరియు రఘుదేవపురం గ్రామంలో రెండు గ్రామ సచివాలయాలు, ఒక వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఒక రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
గత ప్రభుత్వంలో ప్రజలకు పాలన అనేది ఆమడ దూరంలో ఉంటే నేడు పాలన అనేది ప్రజలకు అడుగు దూరంలోకి తీసుకువచ్చిన నాయకుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ , రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా లు పేర్కొన్నారు.
సోమవారం నాడు సీతానగరం మండలం రాపాక గ్రామంలో వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్,రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం, రఘుదేవపురం గ్రామంలో రెండు గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి మంత్రి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన రావు ఆశీస్సులతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం జరిగిందన్నారు. విత్తనాన్ని మొక్కగా, మొక్కను చెట్టుగా తీర్చిదిద్దినది జక్కంపూడి రామ్మోహనరావు అని తెలియజేశారు. ఆయన ప్రోత్సాహంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా ,జిల్లా అధ్యక్షులుగా పని చేసి నేడు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రివర్యులుగా, జిల్లా ఇన్చార్జి మంత్రిగా అవకాశం లభించిందన్నారు
పాలనే అనేది గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించి, సచివాలయం అనేవి హైదరాబాదు మరియు అమరావతిలకే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతోనే గ్రామ ప్రజల అవసరాలను సచివాలయాల ద్వారా గుర్తించి పరిష్కరించా లనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థకు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. భారతదేశ చరిత్రలో ఈ తరహా ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు.
రైతు ఆధారిత రాష్ట్రంలో గత ప్రభుత్వం రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం తప్ప రైతులకు ఏ విధమైన లబ్ది చేకూర్చ లేదన్నారు.
గత ప్రభుత్వంలో అయితే రైతులు ఏవైనా సబ్సిడీ పొందాలన్నా ప్రభుత్వం నుండి లబ్ది పొందాలన్నా నాయకుల చుట్టూ ప్రదక్షణం చేసే ధోరణి ఉండేదని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అవసరాలను గుర్తించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది రైతులను ఆర్ధికంగా ఆదుకునే విధంగా రైతు భరోసా పథకం ద్వారా రూ.13500లను నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నామన్నారు. రైతులు పండించుకునే పంట నుండి అమ్ముకునే వరకు రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని అన్నారు.
రాజానగరం నియోజకవర్గంలో సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్ నిర్మాణం రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే ముందు వరుసలో ఉందని ఆయన తెలియజేశారు. దీనికి గల కారణం జక్కంపూడి రాజా కృషి అని రాజాను మంత్రి అభినందించారు.
తూర్పుగోదావరి జిల్లాలలో రైతుల పేరిట ప్రతిపక్ష నాయకులు రాక్షస క్రీడ చేస్తున్నారని రైతులు అంటే మన దేశంలో అన్నం పెట్టే దాతలని, ఈ రాక్షస క్రీడ ద్వారా రైతాంగం పట్ల ప్రజలలో వేరే భావం కలిగే విధంగా ప్రతిపక్ష నాయకులు సృష్టించే విధంగా చేస్తున్నారన్నారు.
సామాజిక మాధ్యమాలు మరియు మీడియా సృష్టి వలన లేనిది ఉన్నట్లుగా సృష్టించి 14 సంవత్సరాలు ప్రజలను మోసం చేయడం జరిగిందని, పరిపాలన ఏ విధంగా అడ్డుకోవాలి పాలనను ఏ విధంగా దారి మళ్ళించాలి అన్న ఆలోచన ధోరణి తోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేస్తున్నారు..
మన దగ్గర రెండే రెండు మార్గాలు ఉన్నాయని కొంతమంది బాగు కోసం మనం బలి అవుదామా? మన అందరి బాగు కోసం జగనన్న చేస్తున్న యజ్ఞంలో మనం భాగస్వాములు అవుదామా? రైతు సోదరులు అందరూ తప్పనిసరిగా ఒకసారి ఆలోచించుకోవాలని ఆయన తెలియజేశారు.
ప్రజల దృష్టిని మరలచడానికే చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులతో యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు.
మనం మన కోసం కాదు ముందు తరాల భవిష్యత్ కోసం అనుకున్నప్పుడు ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తుందని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అందరూ బాసటగా నిలవాలన్నారు.
ప్రజలందరూ రైతు ముసుగులో ప్రతిపక్షాలు చేస్తున్న రాక్షస క్రీడకు సరైన గుణపాఠం చెప్పాలన్నారు..
ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడేళ్ళ కాలంలో పరిపాలనకు సబంధించి ఎన్నో సంస్కరణలు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తురన్నారు.
గత ప్రభుత్వాలు గ్రామాలను పూర్తిగా విస్మయం చేశాయని,గ్రామాల అభివృద్ధి చెందితేనే,రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గ్రహించిన రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన రెడ్డి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు..
అత్యంత పారదర్శకంగా,నిష్పక్షపాతంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న దేశ వ్యాప్తంగా ఏదయినా ఉందంటే అది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు.ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి దక్కుతుందన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు , పురుగుల మందులు సరఫరా, పంటల సాగుకు సంబంధించిన తదితర విషయాల గురించి వివరించడం జరుగుతోందని రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరమని, రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు నేడు పధకం ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడం జరిగిందని కార్పొరేట్ స్కూల్స్ దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం అమలుచేస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో గ్రామ అభివృద్ధి కోసం ఒక కోటి 20లక్షల ఖర్చు చేస్తే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఈ గ్రామాల అభివృద్ధి కోసం 13 కోట్ల 50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంకా ప్రజలకు మెరుగైన పరిపాలన అధించాలనే తాపత్రయంతో సలహాలు సూచనలు కోరుతూ గడప గడపకూ మన ప్రభుత్వం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎవరికైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందని పక్షంలో సత్వరమే అందజేసే విధంగా కారణం కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు
రాష్ట్రంలో ప్రభుత్వ లబ్ధి పొందని ఇల్లంటూ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదని,కాబట్టే ఎక్కడికెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు.
గ్రామాలలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామాన్నారు.