Breaking News

సచివాలయం ఆకస్మిక తనిఖీ…

-న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, 17 వ డివిజన్ బాలాజీ నగర్ లోని 78 వ వార్డ్ సచివలయాలంను తనిఖి చేసారు. సచివాలయం ముందు ఎటువంటి వెహికల్స్ ను కూడా పార్కింగ్ చేయకుండా చూడాలని, హైవే మిద వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా చూడాలని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. సచివాలయం సిబ్బంది యొక్క పని తీరును మరియు వారి వద్దన గల పలు రిజిస్టర్ లను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకములపై ప్రజలకు పూర్తి అవగాహన కలిపించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. దీనికి సచివాలయం నందలి డిస్ ప్లే బోర్డు నందు పథకముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరం చూపాలని, విధి నిర్వహణలో ఉన్న సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా చూడాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించు సిబ్బందిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *