-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వహించారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందనలో ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించి, మిగిలిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో పరిష్కరించ వలసినదిగా సంబంధిత అధికారులను అదేశించారు. నేటి స్పందనలో మొత్తం 21 అర్జీలు సమర్పించగా వాటిలో పబ్లిక్ హెల్త్ విభాగం – 3, ఇంజనీరింగ్ విభాగం – 4, పట్టణ ప్రణాళిక విభాగం – 12, రెవెన్యూ – 1, యు.సి.డి– 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 8 అర్జీలు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో 3 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 2, యు.సి.డి – 1, సర్కిల్ – 2 కార్యాలయంలో 2 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం – 1 మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో 3 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 2, అర్జీలు సమర్పించినారు అని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.
Prajavartha Online Telugu News