Breaking News

ఓటర్ల ఎడ్యుకేషన్,అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్సు-2022కు ఎంట్రీలు ఆహ్వానం

-1)ప్రింట్ మీడియా,2)ఎలక్ట్రానిక్(టెలివిజన్)మీడియా.
-3)ఎలక్ట్రానిక్(రేడియో)మీడియా,4)ఆన్లైన్(ఇంటర్నెట్)/సోషల్ మీడియా
-నవంబరు 30వ తేదీ లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలి
-2023 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు వినియోగం ఓటర్ల చైతన్యం మరియు అవగాహన-2022 పేరిట భారత ఎన్నికల సంఘం నేషనల్ మీడియా అవార్డులను ప్రధానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ)ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలియజేశారు.ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ (టెలివిజన్) మీడియా,ఎలక్ట్రానిక్ (రేడియో)మీడియా,ఆన్లైన్(ఇంటర్నెట్) సోషల్ మీడియా రంగాల్లో ఓటరు చైతన్యం మరియు అవగాహనకు ఉత్తమ కృషి చేసిన వారికి రంగానికి ఒక అవార్డు వంతున 2012 నుండి ఈవిధంగా అవార్డులు అందిస్తోందని తెలిపారు.2022 ఏడాదికి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 25వ తేది జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఈ అవార్డులను ప్రధానం చేయనుందని ఆయన తెలియజేశారు.అవార్డు కింద నగదు పురస్కారంతో పాటు సైటేషన్, ఫలకం(Plaque) ప్రధానం చేయనున్నారని సిఇఓ పేర్కొన్నారు.ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేందుకు వారిలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యం కలిగించడం,ఓటరుగా నమోదు,రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో విశేష కృషి చేసిన మీడియా హౌస్ లకు భారత ఎన్నికల సంఘం ఈఅవార్డులను ప్రధానం చేయనుందని సిఇఓ మీనా తెలిపారు.ప్రత్యేక జ్యూరీ ఆధ్వర్యంలో క్వాలిటీ ఆప్ ఓటరు అవేర్నెస్ క్యాంపెయిన్,ఎక్స్టంట్ ఆఫ్ కవరేజ్/క్వాంటిటీ,ఓటరు అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన ఆధారాలు తదితరాలను జ్యూరీ పరిశీలించి ఉత్తమ ఎంట్రీలను అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.ఎంట్రీలకు సంబంధించి ప్రింట్ మీడియా న్యూస్ ఐటమ్స్/ఆర్టికల్స్ ప్రచురితమైన కాలం సెంటీమీటర్లు వివరాలను సాప్ట్ కాఫీ పిడిఎఫ్ లేదా న్యూస్ పేపర్/ఆర్టికల్స్ పుల్ సైజ్ పొటోకాఫీ/ప్రింట్ కాఫీ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని సిఇఓ తెలిపారు.అలాగే డైరెక్ట్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన మరే ఇతర సమాచారాన్నైనా పంపవచ్చన్నారు.అదే విధంగా బ్రాడ్ కాస్ట్ టెలివిజన్(ఎలక్ట్రానిక్) మరియు రేడియో(ఎలక్ట్రానిక్)ఎంట్రీలకు సంబంధించి క్యాంపెయిన్ /వర్కు సంక్షిప్త సమాచారం సిడి లేదా డివిడి లేదా పెన్ డ్రైవ్ ద్వారా బ్రాడ్ కాస్ట్/టెలికాస్ట్ అయిన వివరాలు సమర్పించాల్సి ఉంటుందని తెలియజేశారు.ప్రసారమైన అన్ని స్పాట్లు/ న్యూస్ వివరాలను,ఓటరు అవగాహనకు సంబంధించిన న్యూస్ ఫీచర్లు లేదా ప్రోగ్రామ్ లకు సంబంధించిన సిడి లేదా డివిడి లేక పెన్ డ్రైవ్ రూపంలో టెలికాస్ట్/బ్రాడ్ కాస్ట్ అయిన వ్యవధి,తేదీ,సమయం మరియు ప్రీక్వెన్సీ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు.
ఆన్లైన్(ఇంటర్నెట్)/సోషల్ మీడియా ఎంట్రీలు పంపేవారు విధిగా ఓటరు అవగాహనకు సంబంధించిన ఆనిర్దేశిత సమయంలో చేసిన పోస్టులు/బ్లాగ్స్/క్యాంపెయిన్లు/ట్వీట్లు/ఆర్టికల్స్ వంటి వాటి వివరాలను పిడిఎఫ్ సాప్ట్ కాఫీ లేదా సంబంధిత వెబ్ లింక్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.అలాగే పబ్లిక్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఇతర కార్యక్రమాలు,ఇంపాక్ట్ ఆఫ్ ఆన్లైన్ యాక్టివిటీ వివరాలను ఆయా ఎంట్రీలతో కలిపి సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఓటర్ల చైతన్యం,అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్సు-2022కు ఎంట్రీలు పంపే వారు ఆంగ్లం,హిందీ మినహా మిగతా భాషలకు సంబంధించినవి ఆంగ్లం ట్రాన్సులేషన్ తో కలిపి పంపాల్సి ఉంటుందని భారత ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేసిందని సిఇఓ తెలిపారు. ఉత్తమ ఎంట్రీల ఎంపికలో ఎన్నికల కమీషన్ దే తుది నిర్ణయమని ఎంట్రీ దారులతో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలను చేయబోదని ఎన్నికల కమీషన్ తన లేఖలో స్పష్టం చేసినట్టు సిఇఓ పేర్కొన్నారు.ప్రతి ఎంట్రీకి సంబంధించి విధిగా మీడియా హౌస్ యొక్క పేరు,అడ్రస్, టెలిఫోన్ నంబరు,ఫ్యాక్స్ నంబర్లు మరియు ఇ-మెయిల్ అడ్రస్ కలిగి ఉండాలని తెలిపారు.ఎంట్రీలను వచ్చే నవంబరు 30వ తేదీ లోగా ఈక్రింది అడ్రస్ కు పంపాల్సి ఉంటుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు.
ఎంట్రీలు పంపాల్సిన చిరునామా:
లవ్ కుశ్ యాదవ్,అండర్ సెక్రటరీ(కమ్యునికేషన్),
ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా,నిర్వాచన్ సదన్,
అశోక్ రోడ్డు,న్యూఢిల్లీ 110001.
ఇ.మెయిల్:media-division@eci.gov.in.
ఫోన్ నంబరు:011-23052033.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *