Breaking News

భక్తులు పుణ్యస్నానాలు అచరించేందుకు ఘాట్లను సిద్దం చేయండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఘాట్లలో స్నానమాచరించేలా భక్తులను అనుమతించడంపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, కనకదుర్గ దేవస్థానం, పోలీస్‌, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కోవిడ్‌ కారణంగా కృష్ణానది స్నాన ఘాట్లలో భక్తుల అనుమతిని నిలిపి వేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో తిరిగి మరల ఘాట్లలోకి అనుమతించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం కార్తీకమాసం ప్రారంభమైన నేపథ్యంలో అనేక మంది భక్తులు కృష్ణానది స్నానం అచరించాలని కోరుకుంటారన్నారు.భక్తులు ఘాట్లలో స్నానం అచరించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను రాన్ను రెండు రోజులలో పూర్తి చేసి కార్తీకమాసం మొదటి సోమవారం నాటికి సిద్దం చేయాలన్నారు. దుర్గా ఘాట్‌ నందు బ్యారీగేట్లను ఏర్పాటు చేయాలని కృష్ణానదీ వరద నీటిని దృష్టిలో పెట్టుకుని ఏ మేరకు లొపలకు భక్తులను అనుమతించాలనే నిర్ణయం తీసుకుని ఆ ప్రాంతం వరకు ఇనుప మెష్‌లను ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భవాని ఘాట్‌, పున్నమి ఘాట్‌లలో ఏర్పాట్లను మున్సిపల్‌ అధికారులు చేపట్టాలన్నారు. ఘాట్‌ల వద్ద భక్తులు దుస్తులను మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలన్నారు. భవాని ఘాట్‌ పున్నమి ఘాట్‌లలో తాత్కాలిక మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిరంతరం పారిశుద్ద్య పనులు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు.కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు. సమావేశంలో శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నికల్‌ దినకర్‌ పుడ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, ఎసిపి హనుమంతురావు, ఇరిగేషన్‌ ఇఇ కృష్ణారావు, టెంపుల్‌ ఇఇ రమాదేవి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *