-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
-క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యవేక్షించి విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహింస్తూన్న నవంబర్ 1వ తేది రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న అత్యున్నతమైన వై.యస్.ఆర్ లైఫ్ టైం ఎచీవ్మెంట్, వై.యస్.ఆర్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యకమమునకు ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేయుచ్చున్న సందర్భంగా వారధి దగ్గర నుండి ఏ కన్వెన్షన్ సెంటర్ దాకా రోడ్ల ఏర్పాట్ల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా అకర్షణీయమైన మొక్కలు ఏర్పాటు చేసి గ్రీనరి అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. బెంజి సర్కిల్ దగ్గర ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో నేషనల్ హై వే మేనేజర్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు శానిటరీ సెక్రటరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.