విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుణదలలోని నాగేంద్రుని ఆలయాన్ని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పుట్టలో ఆవుపాలు సమర్పించి నాగేంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రకృతిలోని చెట్టు, పుట్ట, నీరు, అగ్ని మొదలైన వాటిని పూజించడం అనాదిగా వస్తోందన్నారు. ముక్కంటికి కంఠాభరణంగా, శ్రీమహావిష్ణువికి శేషపాన్పుగా విరాజిల్లుతున్న నాగేంద్రుని భక్తిభావంతో పూజిస్తే సర్వరోగాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారనేది భక్తుల ప్రగాఢ నమ్మకమని తెలిపారు. నాగేంద్రుని కృపా కటాక్షంతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు. ఎమ్మెల్యే వెంట నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …