విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
1. రాష్ట్రం లో 1976 నుంచి అన్ని పాఠశాల ల అంతర్గత పరీక్షలు నిర్వహణ బాధ్యత ఆయా జిల్లాల లో జిల్లా విద్య శాఖాదికారి చైర్మన్ గా ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు కార్యదర్శి గా వివిధ రకాల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా ఉండే జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రైవేట్ పాఠశాల ల ప్రధానోపాధ్యాయుల ప్రతినిధులు కూడా సభ్యులు గా ఉంటారు
2. అంతర్గత పరీక్షల విషయం లో గతం లో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ కేవలం అన్ని తరగతులకు సంగ్రహణాత్మక పరీక్షల ప్రశ్న పత్రాలు మాత్రమె అందించేది . నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్ష ప్రశ్న పత్రాలు ఆయా పాఠశాల లు ప్రైవేట్ పబ్లిషర్స్ నుంచి కానీ సొంతం గా రూపొందించి ముద్రించి కానీ ఇచ్చేవి.
3. పరీక్షా పత్రాల ముద్రణ కు అవసరమయ్యే ఖర్చు ని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ సభ్యులు బోర్డ్ సమావేశం లో నిర్ణయిస్తారు
4. ఈ ఏడాది కొత్తగా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పరీక్షలు గా రెండు నిర్మాణాత్మక , ఒక సంగ్రహణాత్మక పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించి , మిగిలిన రెండు నిర్మాణాత్మక , ఒక సంగ్రహణాత్మక పరీక్ష పాత పద్దతి లో నిర్వహిస్తున్నారు.
5. ఈ పరీక్షలకు అవసరమయ్యే ముద్రణ ప్యాకింగ్ రవాణా , GST ఖర్చులు కలుపుకుని పేజి కి నిర్ణేత మొత్తం గా నిర్ణయిస్తారు .
6. ప్రభుత్వ పాఠశాల లలో చదివే విద్యార్ధులకు ఈ ఖర్చు ని సమగ్ర శిక్ష ద్వారా జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ లకు అందిస్తుంది. వారి స్తాయి లో ముద్రణ వ్యవహారాలు నిర్ణయిస్తారు
7. గత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తం గా పరీక్షల నాణ్యత పెంచడానికి ప్రభుత్వం SCERT ద్వారా ఉమ్మడి ప్రశ్న పత్రం రూపకల్పన కు నిర్ణయం తీసుకుంది . ప్రైవేటు పాఠశాల అభ్యర్ధన మేరకు గత సంవత్సరానికి మాత్రమే 1 నుంచి 5 తరగతుల పరీక్షల నిర్వహణ లో సొంత ప్రశ్న పత్రాల వినియోగానికి వెసులుబాటు ఇచ్చారు .
8. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ప్రశ్న పత్రాలు విద్యార్ధి లోని ఉన్నత స్తాయి నైపుణ్యాలు వెలికితీసేలా ఉంటాయి కనుక ప్రైవేట్ పాఠశాల ల విద్యార్ధులు లబ్ది పొందాలని ప్రభుత్వం వారికి కూడా ఈ ప్రశ్న పత్రాలు అందించాలని నిర్ణయించింది.
9. ప్రభుత్వ పాఠశాల ల విద్యార్ధి కి పరీక్షలకు అవసరమయ్యే ముద్రణ ప్యాకింగ్ రవాణా , GST ఖర్చులు కలుపుకుని పేజి కి 50 పైసలు గా నిర్దారించి సదరు మొత్తాన్ని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ లకు మంజూరు చేసింది.
10. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక పరీక్షల ప్రశ్న పత్రం సుమారు 10 నుంచి 20 పేజీ ల వరకు ఉండవచ్చు
కనుక 6 సబ్జక్టు లకు అన్ని పరీక్షలకు కలిపి వారి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ ల నిర్ణయం మేరకు పేపర్ ధర , ముద్రణ, ప్యాకింగ్, రవాణా , GST ఖర్చులు నిర్ధారించి వసూలు చేస్తారు. ఉదాహరణ కి తూర్పు గోదావరి జిల్లలో 175 రూపాయలు వసూలు చేస్తున్నారు. విజయనగరం జిల్లలో 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. పూర్వ YSR కడప జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ ఈ ఏడాది ఫీజులు పెంచలేదు . గత సంవత్సర రుసుము లు మాత్రమె వసూలు చేస్తున్నారు. ఈ విధం గా ఆయా జిల్లా ల జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ లు నిర్ణయం మేరకు ఈ ఫీజులు ఉంటాయి .ఈ విషయం తాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించదు. ఇది 1976 నుంచి ఉన్న సంప్రదాయమే. కొత్తగా ఏ మార్పులు రాలేదు.
11. ప్రైవేట్ పాఠశాల ల గుర్తింపు కి అనుమతి ఇచ్చే సమయం లో నే రాష్ట్ర విద్యా శాఖ నిబంధనలు పాటించాలని నిబంధనలు ఉంటాయి . ఇంత కాలం గా ఈ నిబంధనలను కొన్ని ప్రైవేట్ పాఠశాల లు పట్టించుకోకపోవడం వల్ల వెసులుబాటు ఉంది అని భావిస్తున్నారు. కానీ పరీక్షల నాణ్యత ని పెంచేందుకు తీసుకున్న చర్యల లో భాగం గా ప్రశ్న పత్రాలను SCERT నుంచి తయారు చేసి పంపుతున్నారు
12. గతం లో కూడా ప్రైవేట్ పాఠశాల లు స్కూల్ ఫీజు లో భాగం గా పరీక్షల ప్రశ్న పత్రాల కు కూడా రుసుం వసూలు చేసేవారు.
13. SALT ప్రాజక్టు లో భాగం గా ప్రభుత్వ పాఠశాల ల విద్యార్ధుల కు ఉత్తమ మైన అసెస్మెంట్ లు అందించడం , వాటి విశ్లేషణ చేయడం , రేమిడియల్ బోధన కు సహకారం అందించేందుకు ఎడ్యుకేషనల్ ఇనిషి యేటివ్స్ తో ఒప్పదం కుదుర్చుకుంది. అందువలన ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్లు OMR లు అందించడం లేదు. OMR ల ముద్రణ కు ప్రైవేట్ పాఠశాల ల నుంచి జిల్లా ప్రైవేట్ ఉమ్మడి పరీక్షల బోర్డ్ లు రుసుం వసూలు చేయడం లేదు. ప్రైవేట్ పాఠశాల లకు విశ్లేషణ ఒప్పందం లేనందున OMR లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రశ్న పత్రం లోనే టిక్ చేయవలసిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది . ఈ విషయం జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్లు లు ఆయా యాజమాన్యాలకు వివరాలు అందించారు .
14. పాఠ్య పుస్తకాల విషయం లో గత విద్యా సంవత్సరం లో ప్రైవేట్ పాఠశాల ల నుంచి ఇండెంట్ తీసుకున్నాము. అంతకు ముందు ప్రైవేట్ పబ్లిషర్లు తమ ఇష్టం వచ్చిన రేట్ కి అమ్మేవారు . ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర కే ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులకు కూడా అందిస్తున్నాము .
15. కాగా జిల్లాలలో ప్రైవేట్ స్కూల్స్ కావాల్సిన పుస్తకాలు ధర ఇలా ఉంది .
Prajavartha Online Telugu News