విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైసిపి మంత్రులు అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో కొట్టేటి హనుమంతరావు (మాజీ ఫ్లోర్ లీడర్, పార్లమెంట్ కార్యదర్శి) మండిపడ్డారు. ఆదివారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టెటి హనుమంతరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు వైసీపీ పార్టీ నాయకులే వెన్నుపోటు దారులు. వైసీపీ నాయకులు మంత్రులు అమర్నాథ్ , ధర్మాన ప్రసాద్ వీరి వైఖరి పట్ల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మూడున్నర సంవత్సర కాలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పై మీకు నిజంగా ప్రేమ ఉంటే మీ మంత్రి పదవులకు , ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని సవాల్ విసిరారు.విశాఖ అభివృద్ధి ఎవరు హాయంలో జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు. మంత్రులు అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రిషికొండని మంత్రులు వైసీపీ పార్టీ నాయకులు మట్టిని దోచుకొని కోట్ల రూపాయల దోచుకొని కొండను గుండు చేశారు. ఇంక మీరు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు అని ప్రశ్నించారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ నువ్వు రాష్ట్రంలో ఒక పరిశ్రమ అయినా తీసుకొచ్చావా? నువ్వు మంత్రిగా ఉండటం ప్రజలకు ,రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి అక్రమాల భాగవతం బుద్ధ వెంకన్న ఎక్కడ బయట పెడతారని భయంతో జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు వెన్నులో వణుకు మొదలైంది. పోలీస్ అంధతో బుద్దా వెంకన్న ని ఉత్తరాంధ్ర రాకుండా అరెస్ట్ చేయడం ఇంతకన్నా అరాచకం ఉందా అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో అలజడి సృష్టిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మూడు రాజధానులు చర్చి పెట్టి, ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రజల మదిలో నుంచి చెరిపేయాలని చూస్తున్నారని విమర్శించారు..రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, విద్య ఉద్యోగ పరిశ్రమలు రావాలన్నా ఒకే రాష్ట్రం ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు. 2024లో వైసీపీ పార్టీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు, విద్యాధరరావు , కొండపల్లి బుజ్జి కి బుద్ధా వెంకన్న ని విమర్శించే స్థాయి లేదు, మీరు చేస్తున్న అవినీతి నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని అన్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ది చెబుతామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, పార్లమెంట్ SC సెల్ ఉపాధ్యక్షుడు దోమకొండ రవికుమార్, బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …