Breaking News

ప్రత్యేక హోదా తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం… : గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక హోదా తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం కోసం వైసీపీ, తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు గట్టిగా కృషి చేయాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కోరారు. ఆదివారం ఊర్మిళ నగర్ లోని తన కార్యాలయంలో ప్రత్యేక హోదా కోరుతూ ఆయన కళ్ళకు గంతలతో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో  గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ హత్యకు గురైన 30వ తేదీని పురస్కరించుకొని ప్రతి నెల 30వ తేదీన తాను ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని చెప్పారు. చీకటి నుంచి వెలుగు కోసం అనే నినాదంతో తాను చేపట్టిన ప్రత్యేక హోదా గాంధీ దీక్షలు నేటితో 393 వ రోజుకు చేరుకున్నాయని ఆయన వివరించారు. ప్రత్యేక హోదా కోసం తాను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను కలుస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో భాగంగానే ఇటీవల తమిళనాడులో ఇరువురు కాంగ్రెస్ ఎంపీలను, అలాగే ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీ ని కలిసి వివరించడం జరిగిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ఉద్యమిస్తానని చెప్పారు. అసత్యాలు మాని నోటుకి ఓటు మాని ప్రతిఒక్కరు స్వచ్ఛంద వైఖరితో రాష్ట్ర కోసం, దేశం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం ట్రస్ట్ సభ్యులు ఆర్.శివరంజని, బి.భారతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *