Breaking News

విజయవాడలో స్వచ్ఛ భారత్‌ 2.0

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి పౌరుడు తమ పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా నిర్వహించు కోవాలని కంట్రోలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అక్కౌంట్స్‌ (సి.సి.ఎ) కార్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ కంట్రోలర్‌ కె.వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం, సి.సి.ఎ. ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయంలో భారతప్రభుత్వ స్పెషల్‌ క్యామ్పెయిన్‌, స్వచ్ఛతా 2.0 వారోత్సవాలు, అక్టోబర్‌ 24-31 మధ్య నిర్వహిం చారు. జాయింట్‌ కంట్రోలర్‌, యమ్‌.సంధ్యా సమీరా నేతృత్వంలో యం.జి. రోడ్‌లో ఉన్న మైక్రోవేవ్‌ టవర్‌ భవనం, పెన్షన్‌ విభాగాల ప్రాంగణంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను టెలికాం సిబ్బందితో నిర్వహించారు. స్వచ్ఛ భారత్‌ 2.0 కార్యక్రమం ఆరోగ్యభారత్‌కు ఇతోధికంగా దోహదం చేస్తుంద న్నారు. ఈ కార్యక్రమంలో అకౌంట్‌ ఆఫీసర్లు యన్‌. రాధ గోపాల్‌, సురేష్‌ కుమార్‌, బిక్షమయ్య, సంతోష్‌కుమార్‌, భవాని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *