Breaking News

24వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

-ప్రతి కుటుంబానికీ సంక్షేమ లబ్ధి
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతిఒక్క కుటుంబానికీ లబ్ధి చేకూర్చడం జరిగిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 24 వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తరిమిళ్ల నాగిరెడ్డి వీధి, ఇస్మాయిల్ స్ట్రీట్, మందా జోసఫ్ వీధి, ధనియాల మోహన్ రావు వీధి, మాదాస్ పోతురాజు వీధి, థామర్ల యర్రంకి వీధులలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. 380 గడపలను సందర్శించి.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు, హారతులతో బ్రహ్మరథం పట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రతి పేద ఇంటికి చేర్చుతున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన సాగిస్తే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిరంతరం ప్రక్రియగా కొనసాగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేయడం వల్ల.. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో వెనువెంటనే పరిష్కరించడానికి అవకాశం లభించిందన్నారు.

వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శన
పర్యటనలో భాగంగా స్థానిక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మల్లాది విష్ణు సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో అందుతున్న సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశాఖ అందిస్తున్న అన్నీ సేవలను సద్వినియోగపరచుకోవలసిందిగా సూచించారు. పుట్టిన పిల్లలకి 45రోజుల నుండి 16 సంవత్సరాల వరకు వేసే ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అదేవిధంగా సిబ్బందితో ముఖాముఖి నిర్వహించిన ఆయన.. ప్రజారోగ్యానికై చేపడుతున్న కార్యక్రమాలపైనా ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, చిల్డ్రన్ వ్యాక్సినేషన్, షుగర్ టెస్టులు, మలేరియా, డెంగ్యూ టెస్టులపై సిబ్బందిని ఆరా తీశారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా..? అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మీడియాతోమాట్లాడారు.

రాజకీయ దురుద్దేశంతోనే యనమల లేఖలు
జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అండేవని.. ఈ ప్రభుత్వంలో 62.53 లక్షల మందికి పైగా నెలకు రూ. 1,590.50 కోట్లు అందజేస్తున్నట్లు వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 17 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను 25,428 కి పెంచి ప్రతినెలా రూ.6.55 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులంద‌రికీ తాము పింఛ‌న్ అంద‌జేస్తున్నామ‌ని చెప్పడానికి ఈ అంకెలే నిద‌ర్శన‌మ‌ని పేర్కొన్నారు. పైగా ఏడాదికి రెండుసార్లు ఆగష్టు మరియు డిసెంబర్ మాసాలలో నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. తొలి విడతకు సంబంధించి నియోజకవర్గంలో ఆగష్టు నెలలో 1,460 మందికి నూతన పింఛన్లు మంజూరు చేయగా.. డిసెంబర్ మాసంలో రెండో విడత ఉంటుందని తెలియజేశారు. ప్రజలకు పెద్దఎత్తున జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక.. చంద్రబాబు, యనమల లాంటి వ్యక్తులు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆర్థిక నిర్వహణలో వరస్ట్ ఫైనాన్స్ మినిష్టర్ గా అపకీర్తి మూటకట్టుకున్న యనమల కూడా తమ ప్రభుత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకుండా చేయాలని యనమల ఈ విధంగా లేఖలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలతో 151 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారని.. వారికి వస్తున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేక పచ్చ మీడియా విషం చిమ్ముతోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రజల ఆశీస్సులు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు కొమ్ము చంటి, బెల్లపు సత్యనారాయణ, బెల్లపు వెంకట్రావు, ఓబిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బొంగరాల భాస్కరరావు, ఆపూరి మనోహర్, క్రాంతి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *