Breaking News

68లక్షల రూపాయలతో సి.సి రోడ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు రాష్ట్ర పురోభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పాటు పడుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 8వ డివిజన్ ఆచార్యా రంగా రోడ్,కంచుకోట వారి వీధి,బాబు టెక్సటైల్స్ రోడ్ మరియు అశోక్ నగర్ 1st లైన్ లో దాదాపు 68లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణనికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నగర అభివృద్ధి కి అందరం కలిసికట్టుగా పని చేస్తున్నామని, ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులతో పురోగతి సాధిస్తున్నామని అన్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఓడిపోయిన నియోజకవర్గాలకు,స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన డివిజన్ లకు నిధులు మంజూరు చేసేవారు కాదని,చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారని కానీ నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో జగన్ గారి నాయకత్వం లో గెలుపోటములతో సంబంధం లేకుండా అంతటా అభివృద్ధి జరుగుతుంది అని,స్థానిక ఎన్నికల్లో ఈ డివిజన్ లో మా పార్టీ అభ్యర్థి ఓటమి పాలైన సరే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు.ప్రజల్లో రోజురోజుకు ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి ,నియోజకవర్గ అభివృద్ధిని చూసి తట్టుకోలేక తన అసమర్థత ను కప్పిపుచ్చుకునేందుకే గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం లో కాల్ మనీ వేధింపులు, మహిళల సెక్స్ రాకెట్ లో వాళ్ళ ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు అడ్డంగా దొరికితే వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ని ప్రశ్నించారు. గతంలో కూడా వైసీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ నాయకులు వ్యాఖ్యలు చేసారని,ఇలాంటి కవ్వింపు చర్యలతో గొడవలు పెట్టుకుని సానుభూతిని పొందాలని కుట్రలు చేయడం సిగ్గుచేటు అని,శవ రాజకీయలు చేసి అధికారంలోకి రావాలని టీడీపీ వారు కలలు కంటున్నారని అది జరగని పని అని అవినాష్ ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,సీనియర్ నాయకులు చలపాటి వెంకటేశ్వరావు,తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి,వైస్సార్సీపీ నాయకులుపొట్లూరి రవి.సాయి,కొల్లి వాసు,చెర్రీస్ రవి,ట్రస్ట్ హాస్పిటల్ రామాంజనేయులు,మురళి మహిళా నాయకురాలు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *