Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఎప్పుడూ…

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వ వద్ద పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే గడువుకు కొత్త తేదీలను ఇస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కార్యదర్శి ఎం డి ఇక్బాల్ డిమాండ్ చేశారు..

స్థానిక నందిగామ ఎన్జీఓస్ హోమ్ నందు బుధవారంనాడు వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులతో నందిగామ తాలూకా యూనిట్ అధ్యక్షుడు శ్యామ్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన డి ఏ బకాయిలు పిఆర్సి ఏరియర్స్ మరియు విడుదల చేయవలసిన రెండు కొత్త డిఏలు వంటి సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే పరిష్కారం చేస్తామని చెబుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. అలాగే ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విత్రుడాలు చేసుకున్న అమౌంట్ ను ఎంతవరకు జమ చేయలేదని పైగా దానిపై ఇన్కమ్ టాక్స్ కూడా ఉద్యోగులు కట్టారని అలాగే ఐదు డిఏ ఎరియస్ బకాయిలు ఇంతవరకు జమ చేయలేదని ఆయన తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ బిల్లులు ఇన్సూరెన్స్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ బిల్లులు సంవత్సర కాలం పైబడి పెండింగ్లో ఉన్నాయని దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెళ్లి ముహూర్తాలు అలాగే హాస్పటల్ ఖర్చులు వంటి వాటిని బిల్లుల మంజూరుకే ఎదురు చూస్తూ వాయిదా వేస్తున్నారని ఈ విషయంలో ఉద్యోగులు తీవ్ర అసంపూర్తిగా ఉన్నారని వివిధ డిపార్ట్మెంట్ కు సంబంధించిన నాయకులు ఉద్యోగులు జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఉద్యోగుల బిల్లులు మంజూరు చేయకపోవడం సూచినియమని వీటిలో ప్రభుత్వానికి సంబంధించి ఒక్క పైసా కూడా లేదని, ఉద్యోగులు ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బుల్లో బిల్లులు మంజూరు చెయ్యకపోవడం ఎంతవరకు సమంజసమని ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని ఈ విషయాలన్నీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని అలాగే ఉద్యోగులంతా అవసరమైతే ఆందోళన చేయడానికైనా సిద్ధం కావాలని విద్యాసాగర్ పిలుపునిచ్చారు.

జిల్లా కార్యదర్శి ఎండి ఇక్బాల్ మాట్లాడుతూ ఉద్యోగుల హెల్త్ కార్డుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, హెల్త్ కార్డు నుంచి ప్రతినెల ఉద్యోగులు పైకం జమ చేస్తున్నప్పటికీ సరైన వైద్య సేవలు అందటం లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీవో సంఘ అధికార పత్రిక అయిన ఎన్జీవో సమాచారానికి అందరూ చందాదారులుగా చేరాలన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా జరుగుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యం రాజుబాబు, మధుసూదనరావు, రాజశేఖర్, నందిగామ తాలూకా యూనిట్ అధ్యక్షుడు శ్యామ్ బాబు, కార్యదర్శి బాసు, కోశాధికారి యలమందయ్య మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *