విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి గడపలో సంతోషాలు నిండాయని,వారి లోగిళ్ళు నవరత్నాల హరివిల్లు తో విరాజిల్లుతున్నయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 26వ సచివాలయం పరిధిలోని గుణదల పడవల రేవు సెంటర్, దేవినేని నగర్ కొండంచు ప్రాంతాల్లో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రమాణస్వీకారం రోజు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు కేవలం మూడేళ్ళ కాలంలోనే 95 శాతం పైగా హామీలు అమలు చేయడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమం అని కొనియాడారు. గత తెలుగుదేశం అరాచక పాలనకు విసిగివేసారి ఏ నమ్మకం తో అయితే ప్రజలు వైస్సార్సీపీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధముగా జగనన్న పాలన సాగుతోందని,ఇదే ప్రజల మద్దతు తో రాబోయే ఎన్నికల్లో మరొకసారి రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఇంటి వద్దకే పారదర్శకంగా పధకాలు అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారని, ప్రక్క రాష్ట్రాలు కూడా మన వలంటీర్ వ్యవస్థ ను కొనియాడుతున్నాయని అన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సరే కొండ ప్రాంతం,కాలనీలు అనే తేడా లేకుండా నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్య,వైద్యానికి దూరం కాకూడదు అని ప్రభుత్వ పాఠశాలల్లో, ఆసుపత్రిల్లో నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించి 1000 రూపాయలు దాటినా వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. అమ్మఒడి,వసతి దీవెన లాంటి పధకాలు పెట్టీ విద్యార్థులకు అండగా నిలిచారని తెలిపారు. ఈ ప్రాంతంలో కొండంచున ఉన్న చివరి ఇంటి వరకు వెళ్లగా వారు ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా మా బాగోగులు గురుంచి పట్టించుకోలేదు,కానీ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులు, వాలంటీర్లు నిత్యం మాకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు,మా సమస్యలు అడిగి వెంటనే పరిష్కరిస్తున్నారని చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, వైస్సార్సీపీ నాయకులు కోటి నాగులు, డేవిడ్ రాజ్,చందా కిరణ్, జాస్తి ప్రసాద్, జోజి, నాని, గంగాధర్, సుగుణ రాజు, దుర్గారావు, రాఘవ యాకోబు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …