విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ యారం వారి స్ట్రీట్, కార్మికనగర్ కొండ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం కలిగాయలని అందుకే గడపగడపకు వస్తున్న నాయకులను ఆదరిస్తూ మంగళ హారతులు పడుతున్నారని అన్నారు. కేవలం చంద్రబాబు ఇచ్చే ప్యాకేజి, రాజకీయ మనుగడ కోసమే పవన్ కళ్యాణ్ లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఐదేళ్లు ఒక్క పేదవాడికి కూడా సొంత ఇళ్ళు ఇవ్వలేని విషయం మీ కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. నేడు జగనన్న 31లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణానికి అండగా నిలిచి వారి సొంతింటి కల నిజం చేస్తుంటే ఓర్వలేక ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. అందుకే జగనన్న కాలనీలలోకి వస్తున్న ప్రతిపక్ష నేత లను ప్రజలే ఎదురు తిరిగి తరిమికొట్టారు అని తెలిపారు. చంద్రబాబు కి అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వచ్చి మీరు చేసే హడావుడి, మీ సినిమా వేషాలు ప్రజలకు అర్థం అయ్యాయని వారే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన రాబోయే ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇటు తూర్పు నియోజకవర్గంలో, అటు రాష్ట్రంలో వైస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి,డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు చినబాబు,చందా కిరణ్,గిరి, సత్యనారాయణ, రమేష్, వెంకటేశ్వరరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు మాచవరం కి చెందిన సోమురి జ్యోతిర్మయి కి ఆమె భర్త అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా సోమవారం వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చులు నిమిత్తం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి తో కలిసి 15,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.