Breaking News

మధుమేహ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన అవసరం


– యోగా తదితర వ్యాయామ పద్ధతులతో మధుమేహ నియంత్రణ
– అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి. శ్రీదేవి
– వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
– మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక బరువుతో బాధపడుతున్న వారి కోసం అను డయాబెటిస్ క్లబ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డయాబెటిస్ గురించి సంపూర్ణమైన అవగాహన కలిగివుండి, అప్రమమత్తంగా వ్యవహరిస్తే డయాబెటిస్ సంబంధిత దుష్ప్రభావాల బారినపడకుండా ఉండొచ్చని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి. శ్రీదేవి అన్నారు. వైద్య చికిత్సలు తీసుకుంటూ, యోగా తదితర శారీరక వ్యాయమ పద్ధతుల ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆమె తెలిపారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, యోగా శిక్షకులు, యోగా సాధకులు పాల్గొని యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కలిగివుండటం ద్వారా భవిష్యత్తులోనూ డయాబెటిస్ నుంచి రక్షణ పొందవచ్చని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని తెలియజేశారు. షుగర్ వ్యాధి బారినపడకుండా ఉండేందుకు.. ఆరోగ్యకరమైన జీవన విధానాలను అవలంభించడం, మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం వంటి సూచనలను పాటించాలని చెప్పారు. అను గ్రూప్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆవిష్కరించబడిన డయాబెటిస్ క్లబ్ ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు, స్థూలకాయంతో బాధపడుతున్నవారికి విస్తృతమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీదేవి వెల్లడించారు. రూ. 999లతో అను డయాబెటిస్ క్లబ్ సభ్యత్వం పొందడం ద్వారా రూ. ఐదు వేల విలువైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. ఉచిత కన్సల్టేషన్ తో పాటు, వ్యాధి నిర్ధారణ పరీక్షలపై 20 శాతం, మందులపై 10 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని అను డయాబెటిస్ అండ్ ఒబెసిటీ క్లినిక్ ద్వారా అత్యాధునిక వైద్య చికిత్సలను అందిస్తున్నామని డాక్టర్ శ్రీదేవి తెలిపారు. అను డయాబెటిస్ క్లబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలువునిచ్చారు. ఈ కార్యక్రమంలో అను హాస్పిటల్స్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వి.బి. ప్రవీణ్ నాయుడు, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్, కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ దుగ్గిరాల పూజిత, డాక్టర్ రిజ్వాన్, పెద్దసంఖ్యలో యోగా అభ్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *