విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా కామినేని హాస్పిటల్స్ గురుగ్రామ్ కు చెందిన ఆరోగ్య సంరక్షణ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అయిన ఆఫర్డ్ ప్లాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుందని విజయవాడ కామినేని హాస్పిటల్స్ సీఓఓ డాక్టర్ నవీన్ అన్నారు. ఈ మేరకు సోమవారం పోరంకి లోని కామినేని హాస్పిటల్ నందు ఆఫర్డ్ ప్లాన్ స్వాస్థ్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామినేని ఆసుపత్రి రోగులకు వినూత్న, కస్టమర్ స్నేహపూర్వక ఉత్పాదనలను అందించేందుకు ఇది వీలు కల్పిస్తందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఆఫర్డ్ ప్లాన్ ఉనికిని పటిష్ఠం చేయడంలో ఇది తోడ్పడనుందన్నారు.
ఆఫర్డబుల్ ప్లాన్ స్వాస్థ్ అనేది ప్రీ పెయిడ్ డిజిటల్ వాలెట్ అని అవుట్ పేషెంట్ డిపార్ట్ మెంట్ (ఓపీడీ) సేవలు, ల్యాబ్ పరీక్షలు, మందుల కొనుగోలు, అన్ని ఇన్ పేషెంట్ డిపార్ట్ మెంట్ (ఐపీడీ) చికిత్సలకు సంబంధించి ఆశయ ఆధారిత ఈఎంఐ ఆదాలకు ఇది వీలు కల్పిస్తుందన్నారు.ఆఫర్డ్ ప్లాన్ తో ఇప్పుడు విజయవాడ లోని కుటుంబాలు తమ వైద్య బిల్లులపై ఆదా చేసుకునేందుకు వీలవుతుందని,అదే సమయంలో కామినేనే హాస్పిటల్స్ అందించే వివిధ ప్రయోజనాలను అవి పొందగలుగుతాయన్నారు.
ఆఫర్డ్ ప్లాన్ బిజినెస్ హెడ్ (సౌత్) పీఆర్ఎం సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి అని, ఆరోగ్యదాయక డైట్ లేకపోవడం, కెలోరీస్, షుగర్స్, ఫ్యాట్స్, ఫైబర్ పరిమితికి మించి తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి మధుమేహానికి ప్రధాన కారకాలుగా ఉంటున్నాయన్నారు. సరైన ప్రయత్నాలతో మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. ఆహార, జీవనశైలి మార్పులు కోరుకున్న ఫలితాలు అందించడంలో విఫలమైన చోట, చికిత్స తప్పదని, ప్రజలపై భారం తగ్గించేందుకు, అందుబాటు ధరల్లో రెగ్యులర్ చెకప్స్, మందులకు వీలుగా స్వాస్థ్ కార్డును ఆఫర్డ్ ప్లాన్ ప్రవేశపెట్టింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.